తెలంగాణ

పెట్టుబడుల వ్యాపారమంటూ.. రూ. 27 కోట్లు మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు గడించవచ్చని, ఇది పెట్టుబడుల వ్యాపారమంటూ రూ. 27 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఎస్‌విఎస్‌సి వెల్త్‌మేనేజ్‌మెంట్ డైరెక్టర్లను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈస్ట్‌మారెడ్‌పల్లికి చెందిన ఆకుల శ్రీ్ధర్ (37), అతని భార్య ఆకుల చందన నాగోల్‌లో ఎస్‌విఎస్‌సి వెల్త్‌మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. మాస్టర్ ట్రస్టు పేరుతో షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులంటూ అమాయకులను మోసగించి లక్షల్లో పెట్టుబడులు వసూలు చేశారు. కొద్ది రోజులకే మాస్టర్‌ట్రస్టు సంస్థను మూసేసి తమ బంధువైన జంగిని శ్రీనివాస్‌తో పీర్‌లెస్ సెక్యూరిటీ సర్వీసెస్‌తో ఫ్రాంచైజ్ తీసుకున్నారు. 2014లో కోమటిరెడ్డి భిక్షం రెడ్డితో కలసి 80 మంది క్లయింట్ల వద్ద రూ. 3.50 కోట్లు వసూలు చేశారు. ఎస్‌విఎస్‌సి వెల్త్‌మేనేజ్‌మెంట్‌లో తాము వంద కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని నమ్మించి దాదాపు రూ. 27 కోట్లు వసూలు చేశారు. పెట్టుబడులు పెట్టిన తమ మొత్తానికి డబ్బులు చెల్లించకుండా దాటవేస్తున్నారు. అంతేకాకుండా వీరు కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెడతామన్న డబ్బులు పెట్టలేదు. పైగా ఆకుల చందన హైకోర్టులో ఐపి పిటిషన్ వేసింది. దీంతో కూకట్‌పల్లికి చెందిన చంద్రకళ అనే బాధితురాలి ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసగించిన ఎస్‌విఎస్‌సి డైరెక్టర్లు ఆకుల శ్రీ్ధర్, చందనలను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి తెలిపారు.