తెలంగాణ

గాలిలో కాలేజీలు.. దర్జాగా అడ్మిషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఉన్నత విద్య కోసం అర్రులు చాస్తున్న విద్యార్థుల కోరికను ప్రైవేటు విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. తెలంగాణలో పరిమితంగా వ్యవసాయ కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో సీట్లు రాని వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో చేరాలని కోరుకోవడంతో కొన్ని సంస్థలు వారికి సీట్లు ఇచ్చే పేరుతో మోసం చేస్తున్నాయి. యుపి, ఒడిశా, బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ కళాశాలలు ప్రైవేటు యాజమాన్యాలు సైతం నిర్వహిస్తున్నాయి. అక్కడ యాజమాన్య కోటా కింద అడ్మిషన్లకు రాష్ట్రంలో కొన్ని సంస్థలు రింగ్‌గా మారి విద్యార్థులను దోచుకుంటున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ఉన్నత విద్యా మండలి ఇది తమకు సంబంధించిన అంశం కాదన్నట్టుంటే, వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఉద్యానవన శాఖలు తమది కాదన్నట్టు వారుంటున్నారు. కాలేజీలు వేరే రాష్ట్రంలో ఉన్నా, అంత దూరం వెళ్లకుండా హైదరాబాద్ నగరంలోనే ఉండి చదువుకోవచ్చని నమ్మబలుకుతున్నాయి. విద్యార్థులు ఆయా సంస్థల ఉచ్చులో దిగుతున్నారు. గుర్తింపు లేని విద్యాసంస్థలను చూపించి కూడా ప్రైవేటు స్టడీ సర్కిళ్లు సీట్లు ఇచ్చేస్తున్నాయి. ఆ చదువులకు ఎలాంటి గుర్తింపు లేకున్నా తల్లిదండ్రులకు భ్రమలు కల్పిస్తున్న ఈ సంస్థలు నిస్సగ్గుగా అడ్మిషన్లు ఇస్తున్నాయి. అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ, గ్రీన్ లాండ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, ఫ్యూచర్ స్కోప్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్, సుజి అకాడమి, గ్రీన్ ప్లాంట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, విష్ణుప్రియ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, తెలంగాణ అగ్రికల్చర్ కన్సల్టెన్సీ, ఎ టు జడ్ ఎడ్యుకేషనల్ అడ్వయిజర్, బిఎస్సీ అగ్రికల్చర్, శ్రీకర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, ఎడ్యు ప్రొఫెషనల్, ఓమ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ , గ్రీన్ ఫీల్డ్సు ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, మాగ్జిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైనె్సస్, గ్రీన్ లీవ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ వంటి సంస్థలు బహిరంగంగా బోర్డులు పెట్టుకుని మరీ వ్యాపారాలు చేస్తున్నాయి. ఒక సంస్థగా ఇవి గుర్తింపు పొందినా, వ్యవసాయ కోర్సులను ఆఫర్ చేయడానికి, అడ్మిషన్లు చేపట్టడానికి ఎలాంటి అధికారం లేదు. ఇటు యుజిసి, అటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి సంస్థల అనుమతి కాని, చివరికి ఉన్నత విద్యామండలి లేదా వ్యవసాయ శాఖల అనుమతి గాని పొందలేదు. కాని, దర్జాగా అడ్మిషన్లు మాత్రం చేస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేటు వ్యవసాయ కళాశాలల దందాను ఇప్పటికైనా ఆపాలని విద్యార్థులూ, తల్లిదండ్రులూ కోరుతున్నారు.