తెలంగాణ

తెలంగాణకు హడ్కో ‘చేయూత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాల ‘చేయూత’నిస్తున్నామని గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్ధ (హడ్కో) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) డాక్టర్ ఎం. రవికాంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే 31,168 కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, మిషన్ భగీరథ పథకాలకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ (టిఎస్‌ఆర్‌టి) బస్ భవన్, జిహెచ్‌ఎంసి పరిథిలోని బస్సు డిపోల్లో ఎల్‌ఇడి లైటింగ్ సిస్టం కోసం 134.33 లక్షల రూపాయల ఆర్థిక సహాయంగా హడ్కో సిఎండి రవికాంత్ శుక్రవారం తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు, మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణా రావుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా హడ్కో సిఎండి రవికాంత్ మీడియాతో మాట్లాడుతూ బస్సు భవన్, బస్సు డిపోల్లో ఎల్‌ఇడి ట్యూబ్ లైట్ల వెలుగుల కోసం, విద్యుత్తు ఆదా కోసం కోరారని, దానిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ మేరకు హడ్కో-సిఎస్‌ఆర్ పథకం కింద ఆర్థిక సహాయం అందజేసినట్లు వివరించారు. ఇలాఉండగా 46 సంవత్సరాలుగా హడ్కో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్నదని ఆయన చెప్పారు. తెలంగాణకు 31168.00 కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇందులో రుణంగా 18544 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చెప్పారు. హడ్కో సహాయంతో 8.44 లక్షల ఇళ్ళ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇడబ్ల్యుఎస్, ఎల్‌ఐజి ఇళ్లుకూడా ఉన్నట్లు చెప్పారు. ఇంకా నీటి పారుదల, మురుగు నీరు, డ్రైనేజీ, రోడ్లు, వంతెనలు, వీధి దీపాలు, ఆసుపత్రులు, పాఠశాలలు ఇలా ఎనె్నన్నో పథకాలకు ఆర్థిక సహాయం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3230 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పథకాల నిమిత్తం, కొత్త బస్సుల కొనుగోలుకు రుణంగా ఇచ్చినట్లు చెప్పారు.
హడ్కో రుణాలు పొందడం అంత తేలికైందేమీ కాదని, తాము అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. రుణాలు ఇచ్చిన తర్వాత తిరిగి చెల్లించే శక్తి ఉందా, పథకం, ఆర్థిక స్థితిగతులు, చట్టం వంటివి జాగ్రత్తగా పరిశీలిస్తామని అన్నారు. వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంటుందని, అయితే ఎస్‌సి, ఎస్‌టిలకు సంబంధించిన పథకాలకు, ఎల్‌ఐజి వంటి ఇళ్ళ నిర్మాణానికి తక్కువగా ఉంటుందని అన్నారు. మొత్తం ఎన్‌పిఎ 6.2గా ఉంటుందని, నెట్ ఎన్‌పిఎ 2.2గా ఉంటుందని ఆయన తెలిపారు. ఇలాఉండగా తెలుగువాడినైన తనను హడ్కో సిఎండిగా నియమించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. మీడియాతో ఉల్లాసంగా మాట్లాడుతూ ‘మన ఊరి కోకిలమ్మ...నిజమేమో తెలుగు’ అంటూ ఆయన గీతాలాపన చేశారు.