తెలంగాణ

సెంథిల్ కుమార్‌కు ‘సైన్స్ ఫెలోషిప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ జంతుజీవ శాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్ సెంథిల్‌కుమార్‌ను నేషనల్ సైన్స్ అకాడమి ఫెల్లోగా ఎంపిక చేశారు. చేపల పునరుత్పత్తి పరిశోధనల్లో సెంథిల్ కుమార్ సేవలు విశిష్టమైనవి. బెనారస్ హిందూ యూనివర్శిటీ నుండి ఎంఫిల్, పిహెచ్‌డి చేసిన సెంథిల్ కుమార్ పునరుత్పత్తి జీవ శాస్త్రంలో నిపుణులు. యంగ్‌సైంటిస్టు అవార్డు సహా అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన సెంథిల్ అంతర్గత పత్రికకు అకడమిక్ ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు.
న్యూక్లియర్ ఎనర్జీ పోటీల విజేతల ప్రకటన
‘న్యూక్లియర్ ఎనర్జీ- నేషన్ ఎనర్జీ’ పేరిట న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మానస సోమ, సుదర్శన్ రావులు ఎంపికయ్యారు. శారదా విద్యా నిలయంలో 9వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థులను ప్రిన్సిపాల్ జయలక్ష్మి అభినందించారు.