తెలంగాణ

‘గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయించొద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదం పన్ను (ఇటి) మినహాయింపు ఇవ్వవద్దని వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగా రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పన్ను మినహాయింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చిత్రంలో చరిత్రను వక్రీకరించారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ సమీప బంధువు కాబట్టే ఆ రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చినట్లు న్యాయవాది శుక్రవారం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.