తెలంగాణ

పెరిగిన వాహన లైసెన్సు ఫీజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ లైసెన్సు ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్రప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల రూల్స్‌కు చేసిన సవరణను అనుసరించి, కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ ఈ ఫీజులను పెంచింది. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు ఈ ఫీజులను పెంచామని, ఇందులో రాష్ట్రప్రభుత్వ ప్రమేయం ఉండదని, కాని ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాకు జమవుతుందని ఆర్‌టిఏ సంయుక్త కమిషనర్ జె వెంకటేశ్వర్లు ఆంధ్రభూమికి తెలిపారు. పెంచిన ఫీజులను దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయడం ప్రారంభించాయన్నారు.
లెర్నర్స్ లైసెన్స్ (ద్విచక్రవాహనం) ఫీజును రూ. 60 నుంచి రూ. 230కు, లెర్నర్స్ లైసెన్స్ (త్రిచక్ర వాహనం, కారుకు) రూ.90 నుంచి రూ. 360కు, లెర్నర్స్ లైసెన్సు (ద్విచక్ర, కారు, రిక్షాకు కలిపి) ఫీజు రూ. 120 నుంచి రూ. 530, డ్రైవింగ్ లైసెన్సు (ద్విచక్ర) రూ. 475 నుంచి రూ. 885కు, డ్రైవింగ్ లైసెన్సు (ద్విచక్ర, కారు) రూ. 525 నుంచి రూ. 1150కు, డ్రైవింగ్ లైసెన్సు (ద్విచక్ర, కారు, ఆటో) రూ. 575 నుంచి రూ.1450కు, కారు ఓనర్‌షిప్ బదలాయింపునకు రూ. 535 నుంచి రూ. 735కు, అంతర్జాతీయ కారు డ్రైవింగ్ లైసెన్సు ఫీజు రూ. 850 నుంచి రూ. 1350కు పెంచారు. ఇంటి చిరునామా మార్పు ఫీజు రూ. 200 నుంచి 550కు పెంచారు. నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం జారీకి ఫీజును రూ. 85 నుంచి రూ.310కు పెంచారు.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గత నెలలో లైసెన్సు ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అనంతరం రాష్ట్ర రవాణాశాఖ మంత్రుల సాధికారక కమిటీలో పెంచిన ఫీజుల ప్రతిపాదనలను ఆమోదించారు. అనంతరం కేంద్ర మోటారు వాహనాల రూల్స్‌కు సవరణలు చేసి రాష్ట్రప్రభుత్వాలు పెంచిన ఫీజులను అమలు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కొత్త గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ రాష్ట్ర రవాణాశాఖకు చేరింది. కొత్తగా స్లాట్‌లను బుక్ చేసుకున్న వారు కొత్త ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. పెంపుదలను ఇప్పటికే గత మూడు రోజులుగా అమలు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ జె వెంకటేశ్వర్లు తెలిపారు. ఫీజుల పెంపుతో ఇప్పుడొస్తున్న ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయన చెప్పారు. ఈ ఫీజులను కేంద్రం ఆదేశాల మేరకు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందని, ఇందులో రాష్ట్రప్రభుత్వం పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు.