తెలంగాణ

ప్రపంచ పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/మహేశ్వరం, జనవరి 13: ప్రపంచ పటంలోనే తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు వచ్చేలా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల రెవెన్యూ పరిధిలోని ఆగాఖాన్ అకాడమీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలో రెండవ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. తరతరాలుగా తెలంగాణ ప్రాంతంలో పాడి పంటలు రైతుల ఇళ్లకు చేరుకున్న సందర్భంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారని పేర్కొన్నారు. పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడిన యువత.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పండుగలు, సంప్రదాయాలను చాటిచెప్పి నూతన ఉత్సాహాన్ని కలిగించడానికే ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పతంగుల పండుగను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సంక్రాంతి పిండి వంటలు, రంగోలి, పతంగుల పండుగలతో పాటు బాలిక సాధికారికతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. జనవరి 15 వరకు అకాడమీలో, 16న యాదాద్రిలో, 17న వరంగల్‌లో నిర్వహించే కైట్ ఫెస్టివల్‌లో 16 దేశాల నుంచి 10 కైట్ క్లబ్‌ల ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. శుక్రవారం జరిగిన ఫెస్టివల్‌లో ఫ్రాన్స్, జర్మనీ, మలేసియా, సింగపూర్ దేశాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కైట్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఆరువేల మంది విద్యార్థులు హాజరై ఉత్సవాలను తిలకించారు.

చిత్రాలు..హైదరాబాద్‌లోని ఆగాఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించి ప్రసంగిస్తున్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ. వేదికపై మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి చందూలాల్ ఉన్నారు.
*ఫెస్టివల్‌లో ఉత్సాహంగా పతంగులతో పాల్గొన్న విదేశీయులు