తెలంగాణ

ఆర్టీఏ అధికారుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ నగరశివారులోని పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 28 ప్రైవేట్ బస్సులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
సరైన పత్రాలు లేని సర్వీసులను నడుపకూడదని, ఒకవేళ అలా చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇదిలావుండగా ఇటీవలి కాలం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీఏ అధికారులు జరిపిన తనిఖీల్లో దాదాపు 225 కేసులు నమోదయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు ట్రావెల్స్, పాఠశాలలకు చెందిన 86 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు ఆర్టీఎ అధికారులు తెలిపారు. మోటారు వాహన చట్టం ప్రకారమే ప్రైవేటు బస్సు సర్వీసులు నడపాలని అధికారులు సూచించారు.