తెలంగాణ

హెచ్‌సిఎ ఎన్నికల్లో అజర్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించి, నామినేషన్ దాఖలు చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్‌కు చుక్కెదురైంది. అజర్ దాఖలు చేసిన నామినేషన్‌ను హెచ్‌సిఎ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నెల 17న హెచ్‌సిఎకు ఎన్నికలు జరగనున్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజర్‌పై 2000 సంవత్సరంలో బిసిసిఐ జీవిత కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 12 సంవత్సరాల క్రితం ఏపి హైకోర్టు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ అజర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయినా బిసిసిఐ అధికారికంగా అజర్‌పై నిషేధాన్ని ఎత్తి వేయలేదని హెచ్‌సిఎ కార్యదర్శి శేషు నారాయణ శనివారం మీడియాకు తెలిపారు. జీవితకాల నిషేధంపై అజర్ ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని ఆయన తెలిపారు. మంత్రి హోదాలో ఉన్న వివేక్ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించలేదని అజర్ ప్రశ్నించడం గురించి విలేఖరులు ప్రస్తావించగా, ఆయన మంత్రి కాదని, మంత్రి హోదాలో మాత్రమే ఉన్నారని శేషు నారాయణ వివరణ ఇచ్చారు. అజర్ ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నామని అన్నారు. లోధా కమిటీ సూచించిన నిబంధనల ప్రకారమే తమ ప్యానల్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కార్యదర్శిగా తలపడుతున్న శేషు నారాయణ వివరించారు. ఇలాఉండగా అజర్ నామినేషన్ రద్దు కావడంతో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, జయసింహ రేసులో మిగిలారు.
న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తా
అజర్ మీడియాతో మాట్లాడుతూ తన నామినేషన్‌ను తిరస్కరించడంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ లోగడ కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ నామినేషన్‌ను తిరస్కరించారని ఆయన తెలిపారు. అలాగైతే రాష్ట్ర మంత్రి హోదా గల పదవిలో కొనసాగుతున్న వివేక్ నామినేషన్‌నూ తిరస్కరించాల్సి ఉంటుందని అన్నారు. మొదటి నుంచి తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నదని ఆయన విమర్శించారు.