తెలంగాణ

జిఇఎస్‌తో శాఖల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 15: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేస్తూ కొత్తగా రాష్ట్ర జియోగ్రాఫిక్ ఇన్ఫ్‌ర్‌మేషన్ సిస్టమ్ (జిఐఎస్)ను ఆవిష్కరించేందుకు సన్నాహాలుచేస్తోంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ బృహత్తర ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుకు సమాచార టెక్నాలజీ శాఖ సాంకేతిక సహాయాన్ని అందించనుంది.
అన్ని శాఖల సమాచారాన్ని జిఐఎస్ ద్వారా సేకరించి కామన్ పోర్టల్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ ప్రాజెక్టు అమలుకు ఒక కనె్సల్టెన్సీ సహాయాన్ని తీసుకోనున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలు, పాత 10 జిల్లాలకు చెందిన సమగ్ర సమాచారం, సచివాలయంలోని సమాచారాన్ని జిఐఎస్ టూల్ ద్వారా సేకరిస్తారు. ఇప్పటికే భారీసాగునీటిపారుదల, పాఠశాల విద్య, మున్సిపల్ పరిపాలన శాఖ, రెవెన్యూ (్భమి రికార్డులు), గనులు, భూగర్భ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్, రవాణా శాఖలు జిఐఎస్ టెక్నాలజీని ఉపయోగించి తమ ఆస్తులు, వనరులను గుర్తించాయి. ఈ శాఖలు ఇంతవరకు సొంతంగా జిఐఎస్ టూల్‌ను ఉపయోగించి సమాచారాన్ని సేకరించాయి. అడవుల మంత్రిత్వ శాఖకు తమ పరిధిలోని గనుల శాఖ వివరాలు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కామన్ పోర్టల్ ఉంటే అడవుల శాఖ గనుల శాఖ వివరాలను వెంటనే తెలుసుకునేందుకు వీలుంటుంది. కామన్ పోర్టల్ వల్ల జవాబుదారీ తనం, పారదర్శకత పెరుగుతుంది. అలాగే వివిధ శాఖల మధ్య సమన్వయం పెరిగి సమాచారాన్ని వేగంగా పంచుకుని బహుముఖ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుంటుంది. సాగునీటిపారుదల శాఖ సేకరించిన చెరువులు, సరస్సుల సమాచారం వల్ల మత్స్యశాఖ చేపల పెంపకం అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. సాగునీటిపారుదల ప్రాజెక్టుల నీటి లభ్యతను బట్టి వ్యవసాయ శాఖ రైతులను ఏ పంట వేయాలనే దానిపై అప్రమత్తం చేయవచ్చు. పాఠశాల విద్యను జియో టాగ్ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఎన్ని పాఠశాలలకు స్కూలు భవనాలు ఉన్నాయనే విషయంతో పాటు విద్యార్థుల బయోమెట్రిక్ ద్వారా హాజరు వివరాలు వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జియో ట్యాగ్ పరిధి కిందకు తెచ్చి, అక్కడి సదుపాయాలు వెంటనే తెలుసుకోవడమే కాకుండా వైద్యుల హాజరు, ఔషధాల పంపిణీ వివరాలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.25వేల కోట్ల బడ్జెట్ ఉంది. సంక్షేమ రంగానికి దాదాపు రూ. 35 వేలకోట్ల నిధులు కేటాయించారు. జియో ట్యాగ్ వల్ల ప్రతిశాఖలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా అందుతాయి. టౌన్ ప్లానింగ్ శాఖకు జియో ట్యాగ్ వల్ల పన్నుల వసూళ్లతో పాటు పనులను సక్రమంగా మదింపు వేశారా లేదా అనే విషయం ప్రభుత్వానికి చేరుతుంది. నాలాలు, సరస్సులు, ఆక్రమణల వివరాలను వెంటనే గుర్తిస్తారు.