తెలంగాణ

నత్తనడకన నాగోబా జాతర ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉట్నూరు, జనవరి 15: ఆదిలాబాద్ జిల్లాలో మెస్రం వంశీయులు ఆరాధ్య దైవమైన నాగోబా జాతర మరో పది రోజుల్లో ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించిన సౌకర్యాలు, ఏర్పాట్లు నత్తనడకన కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే నాగోబా జాతర ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి గిరిజన సంస్కృతి, సంప్రదాయాల వధ్య ప్రారంభం కానుండగా ఇప్పటివరకు పనులు అంతంతా మాత్రంగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆలయానికి రంగులు వేయడం, పిచ్చిమొక్కలు తొలగించడం తదితర పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. అదేవిధంగా దర్బార్ మైదానం తప్పా జాతర మైదానం, బస్సులు నిలిపే స్థలం, పార్కింగ్ స్థలాల్లో పిచ్చిమొక్కలు అలాగే వెక్కిరిస్తున్నాయి. తాగునీటి కోసం సౌకర్యాలు కల్పిస్తున్నా అక్కడక్కడా కుళాయిల ఏర్పాటు చేస్తున్నారు. జాతర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.40 లక్షలు మంజూరు చేయగా అభివృద్ధి పనులను వేగవంతంగా కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు నత్తనకడన కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయగా అవి అలాగే మూలనపడి ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాటిసరకంగా పనులు జరుగుతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా కోనేరు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 40 శాతం పనులు కూడా పూర్తికాలేదు. గోవాడ ప్రాంగణం సైతం చెత్తచెదారం, పిచ్చిమొక్కలు అలాగే ఉన్నాయి. అదే విధంగా గతంలో నిర్మించిన కుళాయిల ట్యాప్‌లు వెక్కిరిస్తున్నా కొత్తవాటికే ప్రాధాన్యతనిస్తున్నారే తప్పా పాత వాటికి మరమ్మతులు చేపట్టడం లేదు. అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుతున్నప్పటికీ పనులు నాసిరకంగా, నత్తనడకన జరుగుతుండడంతో గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో పది రోజుల్లో ప్రారంభమయ్యే రాష్ట్ర పండగకు జిల్లా ప్రజలే కాకుండా పలు రాష్ట్రాల నుండి గిరిజనులు రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేలుకొని ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తిచేయించాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.