తెలంగాణ

నల్లధనంతో వినాశనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జనవరి 15 : దశాబ్దాలుగా పేరుకుపోయిన నల్లధనం కారణంగా దేశం వినాశనానికి దారితీసిందని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిస్థాయి మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుందని కేంద్ర ఆరోగ్య, సంక్షేమ శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే అన్నారు. నల్లధనం వెలికితీతలో ప్రజలు అన్ని విధాలుగా ప్రధాని నరేంద్రమోదీకి సహకరించడంతోటే నేడు నల్లధనం వెలికితీత కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగిందని రాయిచూర్‌లోని బిజెపి కార్యక్రమంలో పాల్గొని తిరుగు పయనంలో ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన కొద్దిసమయం ఆగి విలేఖరులతో మాట్లాడారు. దేశం నల్లధనంలో అన్నివిధాలుగా నాశనం అవుతోందన్న ఆలోచనతో మోదీ ఓ మంచి నిర్ణయం తీసుకోవడంతోటే యావత్ దేశ ప్రజలు, యువకులు, ఉద్యోగులు, రైతులు ఆయన నిర్ణయాన్ని స్వాగించడం తోటి నేడు సక్సెస్ అయ్యారని అన్నారు. ముఖ్యంగా తన కొత్త ఆలోచన విధానాలతో యువతను మేల్కొల్పడడంలో ప్రధాని మోదీది ఎంతో శ్రమ ఉందని అన్నారు. నల్లధనం వెలికి తీయడంలో రైతులు కొంత ఇబ్బందులు పడ్డవిషయం వాస్తవం అయినప్పటికీ వారు సర్దుకొని తమ ఇబ్బందులను అధిగమించి ముందడుగు వేశారన్నారు.
కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం వారి స్వార్థ రాజకీయాల కోసం నల్లధనం వెలికితీతను అడ్డుకొంటూ లేనిపోని రాద్ధాంతాలు చేశారని తెలిపారు. చివరికి ప్రజల సహకారం, మదతు ఉన్నంతవరకు ఎవరు కూడా ఏమీచేయలేరని ఆయన అన్నారు. తెలంగాణ నూతన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానాలు ఎంతో మంచివైనప్పటికీ కేంద్రం ఆలోచన విధానాలకు అనుగుణంగా ఉన్నప్పుడే అధి సహకారం అవుతుందని ఆయన అన్నారు. సమావేశంలో భాజాప రాష్ట్ర నాయకులు కొండయ్య, బిజెపి నాయకులు కోళ్ల వెంకటేష్, అనుగొండ జగదీష్, రుద్రసముద్రం రాంలింగం, కల్లూరి నాగప్ప, చీరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మక్తల్‌లో విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే