తెలంగాణ

రోడ్డు భద్రతపై నేటినుంచి వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: ఈ నెల 17 నుంచి 23 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావు తెలిపారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని డిపోలలో కార్మికులకు భద్రతపై తగు సూచనలు చేస్తారని, డ్రైవర్లకు వర్కుషాపు ఉంటుందని ఎండి తెలిపారు. రాష్ట్రంలో ఏటా 7వేల మంది మృత్యువాత పడుతున్నారన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో యువత ఎక్కువగా ఉంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రమాద మృతుల సంఖ్య సైబరాబాద్‌లో 1125, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలు తరువాత స్థానంలో ఉన్నాయని పేర్కొన్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా సుప్రీం కోర్టు నిర్దేశకాలను తప్పకుండా పాటిస్తామని, ప్రమాదాల నివారణకు రాష్ట్రంలో విద్యాసంస్థలు తదితరాలతోపాటు సాధారణ కార్యక్రమాలతో అవగాహన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.