తెలంగాణ

గర్భిణులకు ఆర్థిక సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: గర్భిణీ స్ర్తిలకు వైద్య సహాయంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆర్థిక సహాయం ఎంత అనేది ఇంకా నిర్ణయం జరగలేదు. ఈ అంశంపై ఇటీవల రాష్ట్ర అధికారుల బృందం స్మితా సబర్వాల్ నేతృత్వంలో తమిళనాడులో పర్యటించి వచిచంది. అక్కడ ప్రజా ఆరోగ్యం దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా బాగుంది. ప్రభుత్వ ఆస్పత్రులలోనే ఎక్కువగా ప్రసవాలు నమోదు అవుతున్నాయి. దీనిపై అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గర్భిణీ స్ర్తిలకు తమిళనాడు ప్రభుత్వం పది వేల రూపాయల సహాయం అందిస్తోంది. గర్భిణీ స్ర్తిలకు ఆరువేల రూపాయల సహాయం అందించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు. కేంద్రం అందించే సహాయం, రాష్ట్ర ప్రభుత్వ సహాయం కలిపి ఎంత వరకు ఇవ్వవచ్చు అనే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యమంత్రితో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తారు. గర్భిణీ స్ర్తిలను గుర్తించి వారిని తప్పని సరిగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆస్పత్రికి తీసుకు రావడానికి రవాణా సౌకర్యం, వచ్చిన తరువాత ఆస్పత్రిలో పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. ప్రసూతి తేదీని ముందుగానే గుర్తించి, ప్రసవానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు. ప్రసవం అనంతరం తల్లి నవ జాత శిశువును సొంత గ్రామానికి ప్రభుత్వ వాహనంలోనే తీసికెళ్లి ఇంటి వద్ద దించుతారు. నవ జాత శిశువుకు, తల్లికి ప్రత్యేక కిట్‌ను అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐసియులను, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.