తెలంగాణ

తొలగుతున్న అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: జిఎస్‌టికి సంబంధించిన కేంద్రం రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన క్రాస్ ఎంపవర్‌మెంట్ అంశంపై అంగీకారం కుదిరిందని తెలంగాణా ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. జిఎస్‌టిని ఎప్రిల్ ఒకటికి బదులు జూలై నెల నుండి అమలు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని రాజేందర్ వెల్లడించారు. రాజేందర్ సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న హాజరైన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రూ.1.5 కోట్ల లోపు వ్యాపారం చేసే డీలర్లలో పది శాతం డీలర్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని, 90 శాతం డీలర్లు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని ఆయన చెప్పారు. 1.5 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు చేసే డీలర్లలో 50 శాతం కేంద్రం, యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారన్నారు. ఐజిఎస్‌టికి సంబందించిన లావాదేవీలపై రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే కేంద్రం మధ్యవర్తిగా వ్యవహరిస్తుందన్నారు. మోడల్ జిఎస్‌టి చట్టాన్ని తయారు చేసి ఏకాభిప్రాయంతో ఆమోదించే పని మిగిలిపోయిందని ఆయన చెప్పారు.
జిఎస్‌టి కింద ఏ మేరకు పన్నులు వేయాలనేది నిర్ణయించవలసి ఉన్నదని, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా దీనిని నిర్ణయిస్తారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను విధింపు ఉండదని రాజేందర్ చెప్పారు. సామాన్య ప్రజానీకం ఉపయోగించే వస్తువులపై అధిక భారం పడకుండా పన్ను ఉండాలని నిర్ణయించారని ఆయన వెల్లడించారు. అధికారులతో జరిపే చర్చల్లో పన్నులకు సంబంధించిన హేతుబద్ధత నిర్ణయించిన అనంతరం దీనిని నిర్దారిస్తారన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తిన అన్ని సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు. పలు వస్తువులకు సంబంధించిన పన్నులను ఇంకా నిర్దారించవలసి ఉన్నందున జిఎస్‌టి అమలును ఏప్రిల్ ఒకటో తేదీకి బదులు జూలై ఒకటో తేదీ నుండి అమలు చేసేలా ఆంగీకారం కుదిరిందన్నారు. ఫిబ్రవరి 18 జిఎస్‌టి సమాఖ్య తదుపరి సమావేశం ఉంటుందంటూ ఇందులో జిఎస్‌టి పన్నులకు రూపకల్పన జరుగుతుందని రాజేందేర్ చెప్పారు.
పశ్చిమ బెంగాల్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా నేటి నిర్ణయాలను ఆమోదించారని ఆయన తెలిపారు. బంగారంపై ఎంత పన్ను ఉండాలనేది కూడా ఇంకా నిర్ణయించలేదన్నారు. జనవరి 31 తేదీ నుండి ప్రారంభమవుతున్న బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లును పార్లమెంటు ఆమోదించవచ్చునని రాజేందర్ వెళ్లడించారు.