తెలంగాణ

దూసుకెళ్తున్న ‘మెట్రో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: రాజధానిలో మెట్రోప్రాజెక్టు పనులు 75శాతం పూర్తయ్యాయని, జూన్‌లో మెట్రో పరుగులు పెడుతుందని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. మొదటి దశ అనుకున్న సమయానికే పూర్తవుతుందన్నారు. 2018 చివరి నాటికి రెండవ దశ పూర్తవుతుందని చెప్పారు. అయితే పాత నగరంలో మెట్రో ఏ మార్గంలో వెళుతుందో ఇప్పటికీ ఖరారు కాలేదన్నారు. హైదరాబాద్ నగరంలో అభివృద్ధిపై మంగళవారం శాసన సభలో లఘ చర్చ జరిగింది. పాత నగరంలో మెట్రో పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని బిజెపి సభ్యులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు అడ్డుకోవడం వల్లనే పాత నగరంలో పనులు చేపట్టలేదని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అనటంతో ఎంఐఎం సభ్యులు ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత నగరంలో దారులు ఇరుకుగా ఉన్నాయని, ఆ మార్గంలో మెట్రో రైలు చేపట్టడం వల్ల మరింత ఇరుకుగా మారుతాయని, దానికి బదులు మరో మార్గంలో పనులు చేపట్టాలని మాత్రమే తాము సూచించినట్టు ఎంఐఎం సభ్యుడు బలాలా తెలిపారు. పాత నగరానికి సంబంధించి శాసన సభ్యుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని కెటిఆర్ తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు చురుకుగా సాగుతున్నాయని కెటిఆర్ తెలిపారు. మూడవ కారిడార్‌లో నాగోల్, మెట్టుగూడ మధ్య 8 కిలో మీటర్లు, ఒకటవ కారిడార్‌లో మియాపూర్, ఎస్‌ఆర్ నగర్ మధ్య 11 కిలో మీటర్ల రెండు స్ట్రైచ్‌లను పూర్తి చేసినట్టు చెప్పారు. టెస్ట్న్ విజయవంతంగా జరిగినట్టు చెప్పారు. వాణిజ్య పరంగా మెట్రోను ప్రారంభించేందుకు మెట్రో రైల్ భద్రతా కమిషనర్ ఈ రెండు స్ట్రెచ్‌లకు భద్రత ధృవ పత్రాన్ని అందించారని చెప్పారు. ఉప్పల్, మియాపూర్‌లలో రెండు పెద్ద డిపోలను పూర్తి చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 61 కిలో మీటర్లు( 85శాతం) పునాదులు, 58 కిలో మీటర్లు వరకు ఫిల్లర్లు(81శాతం) 72 కిలో మీటర్లలో 49 కిలో మీటర్ల వయా డక్ట్(68శాతం )పూర్తి చేసినట్టు కెటిఆర్ తెలిపారు. మొత్తంగా 75శాతం మెట్రో ప్రాజెక్టు పూర్తయినట్టు చెప్పారు. 57 రైళ్లు పట్టాలపై నడవడానికి సిద్ధంగా ఉన్నాయని, షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నట్టు కెటిఆర్ తెలిపారు. మెట్రో పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టి కంపెనీ పక్కకు తప్పుకుంటున్నట్టు, ఇంజనీర్లలో సగం మందిని దుబాయ్‌కి పంపించినట్టు తమకు సమాచారం ఉందని కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ ఎల్ అండ్‌టి ఎక్కడా పనులు ఆపలేదని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ప్రచారం వల్ల వాళ్లు కొంత గందరగోళంలో పడ్డారన్నారు. విభజనతో హైదరాబాద్ ఖాళీ అయిపోతుందని, ఎవరూ ఉండరని ప్రచారం చేశారని, దీని వల్ల వాళ్లు ఆలోచనలో పడ్డారని చెప్పారు. కానీ తరువాత వాస్తవాలు గ్రహించినట్టు చెప్పారు.