తెలంగాణ

పతనం వైపే కాంగ్రెస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రావతరణలో ప్రధాన పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నిలువ నీడ లేకుండా పోతోంది. పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు పొన్నాల లక్ష్మయ్యను తొలగించి ఉత్తమకుమార్ రెడ్డిని టిపిసిసి అధ్యక్షులుగా నియమించినా, పార్టీ క్యాడర్‌ను, నేతలనూ చేజారిపోకుండా కాపాడలేకపోతున్నారు. కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు , నేతలు టిఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్లకుండా నిరోధించకుండా చర్యలు తీసుకోవడంలో టిపిసిసి ఘోరంగా విఫలమవుతోంది. మొన్న జరిగిన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది మేమే అని బోరలు విరిచి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు నిస్సహాయ స్ధితిలో ఉండిపోయారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలును ప్రచారం చేయకుండా, ఎంతసేపూ వ్యక్తిగతంగా తమ గొప్పను చాటుకునేందుకు ప్రయత్నిస్తూ పార్టీ పరువుతీసే నేతలకు కాంగ్రెస్‌లో కొదవలేదు. టిపిసిసి అధినేత ఉత్తమకుమార్ రెడ్డి అందరికీ ఆమోదయోగ్యమైన నేతనడంలో ఎటువంటి సందేహం లేదు. కాని ప్రజా ఉద్యమాల నిర్మాణం, ప్రజల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని పార్టీకి అనుకూలంగా మార్చుకోవడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి, రేణుకా చౌదరి, వి హనుమంతరావు, ప్రతిపక్ష నేత కె జానారెడ్డికి రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. కాని వీరి మధ్య నెలకొన్న అనైక్యత కాంగ్రెస్‌కు శాపంగా మారిం ది. ఈ ఏడాది మార్చిలో పార్టీ పగ్గాలను చేపట్టిన ఉత్తమకుమార్ రెడ్డి పార్టీని సరైన దారిలో నడిపించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు.
అన్ని జిల్లాల్లో పర్యటించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. కాని ప్రజలు ఎందుకో కాంగ్రెస్ పార్టీని ఆదరించడం లేదు. దీనికి కారణాలను తెలుసుకోవడంలో పార్టీ నాయకత్వం సరైన ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ నేతలు పత్రికావిలేఖర్ల సమావేశాలకు పరిమితమయ్యారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో తమ పని ముగిసిందనుకుంటున్నారు. జనంతో, పార్టీ క్యాడర్‌తో కాంగ్రెస్ నేతలకు సంబంధాలు క్షీణించాయి. కాంగ్రెస్ నుంచి కూడా భారీ ఎత్తున టిఆర్‌ఎస్‌లోకి వలసలు ప్రారంభమయ్యాయి. వరంగల్ ఉప ఎన్నికల్లో సిరిసిల్ల రాజయ్య అభ్యర్ధిత్వాన్ని తొలుత ఖరారు చేశారు. అప్పటికే రాజయ్యపై అభియోగాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో రాజయ్య అరెస్టయ్యారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. ఇంత కంటే ఘోరమైన అవమానం మరొకటి కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చు. స్ధానిక సంస్ధల్లో కాంగ్రెస్‌పార్టీకి తగినంత బలం ఉంది. కాని 12 సీట్లకు అభ్యర్ధులను నిలబెట్టలేకపోయింది. ఐదు సీట్లకు పోటీచేసినా, ఇందులో ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీనికి టిపిసిసి నేతల నుంచి సరైన సమాధానం లభించదు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు కరవయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్‌గానే పరిగణిస్తోంది. వచ్చే జిహెచ్‌ఎంసి ఎన్నికలు, నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలను చూసిన తర్వాత మార్పులకు పార్టీ నాయకత్వం శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ చర్యలను గమనిస్తోంది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ సాధించే ఫలితాలను బేరీజు వేస్తుంది. నారాయణ్‌ఖేడ్, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తలరాత మారకపోతే మాత్రం ప్రక్షాళన చర్యలు ఉంటాయి’ అని ఒక సీనియర్ నేత చెప్పారు. ఎంతసేపు టిఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను విమర్శిస్తూ కాలక్షేపం చేయడం మినహా సొంత ఇంటిని చక్కపెట్టుకుని పార్టీని పటిష్ఠం చేసే దిశగా టిపిసిసి నేతలు ఆలోచించడం లేదని ఆ నేత చెప్పారు.