తెలంగాణ

అర్చకుల పెళ్లికి లక్ష నజరానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 17: అర్చకులు, పురోహితులను పెళ్లిచేసుకునేందుకు ఎవరూ ముందుకురాని నేపథ్యంలో బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న బ్రాహ్మణ యువకుల వైవాహిక జీవితానికి చేయూతనిచ్చేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ వినూత్న ఆలోచనకు తెరలేపింది. వారిని పెళ్లిచేసుకునే బ్రాహ్మణ ఆడపిల్లలకు లక్షరూపాయల నజరానా ప్రకటించింది. ఇప్పటికే నిరుపేద బ్రాహ్మణులకు వివిధ రూపాల్లో చేయూతనిస్తోన్న కార్పొరేషన్ తాజాగా అర్చకులు, పురోహితులు, వేదపండితులుగా పనిచేస్తున్న యువకులకు పెళ్లి భాగ్యం కల్పించేందుకు నడుం బిగించింది. యువకులకు కొనే్నళ్ల నుంచి పెళ్లి సంబంధాలు సమస్యగా మారాయి. ఈ క్రమంలో పెళ్లికాని బ్రాహ్మణ యువకుల సంఖ్య పెరుగుతుండటాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్ గ్రహించింది. పురోహితులు, అర్చకులు, వేదపండితులను పెళ్లాడటానికి ఇష్టపడే బ్రాహ్మణ యువతులను ప్రోత్సహించడానికి కంచి కామకోటి పీఠం పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుమీదుగా ‘చంద్రశేఖర (వివాహ) సంస్కార ప్రోత్సాహక పథకం’ ప్రారంభించింది.