ఆంధ్రప్రదేశ్‌

సిఎస్ రేసులో ఇద్దరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఫైనాన్స్ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం, సిసిఎల్‌ఎ కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠాల్లో ఆ పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. తాజాగా ప్రస్తుత సిఎస్ టక్కర్ సెలవుపై వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనకు ఫిబ్రవరి నెలాఖరువరకూ పదవీ కాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణంగా తనను రిలీవ్ చేయాలని అయన ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తదుపరి ఇన్‌చార్జి సిఎస్‌గా అజయ్ కల్లాం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఆ తరువాత పూర్తికాల సిఎస్‌ను నియమించనున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అజయ్ కల్లాంకే ఈ పదవి దక్కవచ్చని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానికి సిఎం వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడంతో దానిని సానుకూలంగానే భావిస్తున్నారు. అంతకంటే ముందు సిసిఎల్‌ఎ పునేఠాకు సిఎస్ పదవి ఇవ్వాలని, చంద్రబాబు భావించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీనియర్ మంత్రులు, సిఎంఒలోని కీలక అధికారి కూడా పునేఠా వైపే మొగ్గు చూపడంతో ఆయన అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయంటున్నారు.