తెలంగాణ

ఆర్థిక నేరాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ఆర్థిక నేరాలపై దృష్టి సారించామని, వీటి నియంత్రణకు ఆర్బీఐ, సెబితో కలసి పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) కె అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక నేరాలు, ఖాతాల రక్షణ, సైబర్ క్రైమ్‌వంటి అంశాలపై సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో దాదాపు 80మంది పోలీస్, సిఐడి అధికారులు పాల్గొన్నారు. సదస్సును ప్రారంభించిన డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్థిక నేరాలు మరింత పెరిగే అవకాశ ఉందన్నారు. అయితే, పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తూ నేరాలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. నేరస్తులు ఆకర్షణీయ బహుమతులు, లక్కీడిప్‌ల పేరిట ఫేస్‌బుక్, ట్విట్టర్లు వంటి మాధ్యమాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిజిపి సూచించారు. సైబర్ నేరాలకు అనుగుణంగానే పోలీసులు తమ స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకుంటూ సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఆ దిశగానే పోలీసులకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. సెబి డిజిపి భావన రవికుమార్ మాట్లాడుతూ అనధికారిక పథకాలకు ఆశపడి మోసపోవద్దని హెచ్చరించారు. పెట్టుబడులపై సెబి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. సిఐడి ఐజిపి డాక్టర్ సౌమ్యమిశ్రా మాట్లాడుతూ ఎవరైనా మోసపూరిత ప్రకటనలకు పాల్పడితే వెంటనే ఆర్థిక నేర విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీస్, ఆర్బీఐ, సెబి అధికారులు కలసి ఆర్థిక నేరాలపై ప్రజలను చైతన్య పర్చాలన్నారు. నేరాలపై పోలీస్ దర్యాప్తులు, స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఆర్బీఐ జిఎం సువేందర్ పాటి తమ సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు ప్రకటించారు. పబ్లిక్ ఇష్యూ, డిపాజిట్లు, ఖాతాల సంరక్షణ వంటి అంశాలపై అధికారుల సదస్సులో చర్చించారు.

చిత్రం... ఆర్థిక నేరాల నియంత్రణ -ప్రజా చైతన్యంపై ఆర్బీఐ నిర్వహించిన
సదస్సులో మాట్లాడుతున్న డిజిపి అనురాగ్‌శర్మ