తెలంగాణ

పోలీసులూ.. సినిమా చూడండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 19: మామూలుగా సెలవు ఊసే ఉండని ఉద్యోగం.. పోలీసు. ఇతర ఉద్యోగులకు ఉన్నట్లు ఆఫ్‌లు వీరికి ఉండవు. కుటుంబంతో కలసి గడిపే సమయమూ తక్కువే. ఇక అంతా కలసి సినిమా చూడటం దాదాపు అసంభవం. కానీ ఆదిలాబాద్ పోలీసులకు అనుకోని వరం లభించింది. అధికారికంగా సెలవు ఇచ్చి మరీ కుటుంబాలతో కలసి సినిమా చూసే ఛాన్స్ దక్కింది. ఎస్‌పి స్వయంగా ఇచ్చిన అవకాశం ఇది. తానూ వారితో కలసి సినిమా చూడటం..ఓ అరుదైన అనుభవం. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన ‘హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ చిత్రం చూసేందుకు ఆదిలాబాద్ ఎస్‌పి శ్రీనివాస్ ఈ అవకాశం కల్పించడం అందరి ప్రశంసలు అందుకుంది.
పోలీసుల వృత్తి ధర్మాన్ని, బాధ్యతలను గుర్తుచేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచే సందేశాత్మక చిత్రంగా ‘హెడ్‌కానిస్టేబుల్ వెంట్రామయ్య’ నిలిచిందని, ఇది పోలీసుల్లోనూ స్ఫూర్తి నింపుతుందని జిల్లా ఎసిపి శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్‌లో ప్రదర్శిస్తున్న ఈ సినిమాను చూసేందుకు కానిస్టేబుళ్లందరికీ ఓ పూట సెలవు ప్రకటించి ప్రత్యేక షోగా తిలకింపజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న గౌరవానికి మచ్చతేకుండా పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు బాధ్యతాయుతంగా విధుల నిర్వర్తించాలని అన్నారు. నిజాయితీగా విధులు నిర్వర్తించాలనే సందేశంతో తీసిన ఈ సినిమాతో జిల్లా పోలీసులు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి విధుల కోసం గడచిన 20 రోజులుగా సెలవులు తీసుకోకుండా జిల్లా పోలీసులు విధుల్లో నిమగ్నమైనారని ఆయన అన్నారు. జిల్లా పోలీసు కుటుంబాల్లో సంతోషం నింపాలనే ఉద్దేశంతో ఓ పూట సెలవు ఇచ్చి ఇలా సినిమా చూసే అవకాశం కల్పించామని అన్నారు. రానున్న రోజుల్లో కానిస్టేబుళ్లకు సైతం ఇలాంటి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంధర్భంగా సినిమాను తిలకించిన ఆదిలాబాద్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ బి.్భమన్న మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుండి భార్యపిల్లలతో కలసి ఎప్పుడూ సినిమా చూడలేదని, సినిమా చూడాలని ఆశ ఉన్నప్పటికీ సమయం లభించకపోవడంతో ఆ ఆలోచనే రాలేదని, ఎస్పీ నిర్ణయంతో తన కుటుంబంతో కలసి సినిమా చూడటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. స్పెషల్ బ్రాంచ్ హెడ్‌కానిస్టేబుల్ ఎస్.ప్రేమ్‌సింగ్ మాట్లాడుతూ పోలీసు శాఖలో సెలవులు లభిచండం కష్టమని, ఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయంతో సెలవుతోపాటు కుటుంబ సమేతంగా ఉచితంగా సినిమా చూసే భాగ్యం కల్గిందన్నారు. జిల్లా పోలీసు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్ కె.తాజోద్దిన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా పోలీసులకు మానసికంగా ప్రోత్సాహం లభించిందన్నారు. స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోలీసు జి.రామన్న మాట్లాడుతూ ఎస్పీ తీసుకున్న నిర్ణయం పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు సైతం ఆనందోత్సాహంతో ఉన్నారని అన్నారు.

చిత్రం..విలేకర్లతో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాస్.