తెలంగాణ

పాలమూరులో పతంగుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జనవరి 19: అంతర్జాతీయ పతంగుల పండుగ సందర్భంగా పాలమూరు పట్టణంలో ఆకాశంలోకి గాలిపటాలు ఎగిరాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పతంగుల పండుగను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశీయులు సందడి చేశారు. జపాన్, కెనడా, ఉక్రెయిన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలతోపాటు మరో 14 దేశాలకు చెందిన వారు ఇక్కడ పతంగులు ఎగురవేశారు. మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన ఈ వేడుకలను తిలకించేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వేలాది మంది విద్యార్థులు తరలిరావడంతో మహబూబ్‌నగర్‌లోని బాలు ర జూనియర్ కళాశాల మైదా నం సందడిగా మారింది. వివిద దేశాలకు సంబంధించిన రకరకాల గాలిపటాలను ఆకాశంలోకి ఎగిరేస్తున్న సమయంలో ప్రజలు కేరింతలు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జాయింట్ కలెక్టర్ శివకుమార్‌నాయుడు, నారాయణపేట సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్య, జిల్లా పర్యాటకశాఖ అధికారి పాండురంగంతో పాటు పలువురు విదేశీయులతో కలిసి పతంగులు ఎగురవేశారు.
డైనోసార్ పతంగిని ఆకాశంలోకి ఎగిరిన సమయంలో అక్కడికి వచ్చిన ప్రజలంతా ఒక్కసారిగా కేరింతలు కొట్టి ఈలలు వేశారు. 20 మంది కైటర్లు గాలిపటాలను ఎగురవేస్తూ ప్రజలను ఉత్తేజపరిచారు. మునుపెన్నడు చూడని రకరకాల పతంగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పతంగుల పండుగతో పాలమూరు ప్రజానికం విదేశీయుల పతంగులను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో సంక్రాం తి పండుగకు గాలిపటాలు ఎగురవేయడం ప్రత్యేకమని, అదే ఆంధ్ర రాష్ట్రంలో వివిధ రకాల ఆటల పోటీ లు నిర్వహిస్తుంటారని అన్నారు. ప్రభుత్వపరంగా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు మహబూబ్‌నగర్‌ను ఎంపిక చేయ డం సంతోషంగా ఉందని అన్నారు.

చిత్రం..మహబూబ్‌నగర్ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో విదేశీయులు ఎగురవేసిన డైనోసార్ పతంగి.
కైట్ ఫెస్టివల్‌లో విదేశీపతంగులను ఎగురవేస్తున్న కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు