తెలంగాణ

అన్ని వర్శిటీలకూ కేంద్రీకృత చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కేంద్రీకృత చట్టాన్ని రూపొందించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సంప్రదాయ యూనివర్శిటీలు, స్పెషలైజ్డ్ వర్శిటీలు, టెక్నాలజీ వర్శిటీల్లో ఒక్కో యూనివర్శిటీకి ఒక్కో చట్టం అమలులో ఉంది. ఆయా యూనివర్శిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు సమావేశమై తమతమ చట్టాలకు స్వల్ప సవరణలను ప్రతిపాదిస్తే దానిని శాసనసభ ఆమోదించి అమలులోకి తెస్తుంది. ఇలా ఒక్కో యూనివర్శిటీకి ఒక్కో చట్టం ఉండటంతో చాలా విషయాల్లో యూనివర్శిటీల మధ్య సారూప్యత లేకుండా పోతోంది. జీత భత్యాలు, పదోన్నతులు, నిర్వహణ, ప్రవేశ పరీక్షల నిర్వహణ, ప్రవేశాలు, అకడమిక్ అంశాలతో పాటు భిన్నమైన పద్ధతులను పాటించడంతో సమస్యలు వస్తున్నాయి. అలాగే వర్శిటీల్లో సిబ్బంది నియామకాలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాల్లో కూడా తేడాలు ఉండటంతో తరచుగా న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్శిటీల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలంటే వివిధ వర్శిటీల మధ్య సిబ్బంది బదిలీలకు అవకాశం లేకుండా పోయింది. వీటన్నింటినీ అధిగమించాలంటే అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే కేంద్రీకృత చట్టాన్ని అమలు చేసి, ఆయా యూనివర్శిటీల స్పెషాలిటీని దృష్టిలో ఉంచుకుని అదనంగా క్లాజులు చేర్చడం మంచిదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. సంప్రదాయ వర్శిటీలకు ఒక చట్టం, టెక్నాలజీ వర్శిటీలకు ఒక చట్టం, స్పెషాలిటీ వర్శిటీలకు మరో చట్టాన్ని రూపొందించడం వల్ల మళ్లీ చట్టాలు ఎక్కువ అయ్యాయనే భావనతో అన్నింటికీ కలిపి ఒకే కేంద్రీకృత చట్టాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే ఒక కమిటీని నియమించారు. వారం పది రోజుల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ప్రాతిపదికగా మరోసారి చర్చించి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.