తెలంగాణ

ఐసిస్ సానుభూతిపరుల అరెస్టులో తెలంగాణకు మూడో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఐఎస్‌ఐఎస్) సానుభూతిపరుల అరెస్టులో తెలంగాణ మూడో స్ధానంలో నిలిచింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గత ఏడాది దేశ వ్యాప్తంగా ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసి మొత్తం 112 మంది సానుభూతిపరులను అరెస్టు చేసి 32 కేసులను నమోదు చేసింది. వీరిలో 11 మంది మహారాష్టల్రో, 11 మంది కేరళలో, 10 మంది తెలంగాణలో అరెస్టవగా, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌లో ఐదుగురు చొప్పున, ఉత్తరప్రదేశ్‌లో నలుగురు, తమిళనాడులో ముగ్గురు, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ఇద్దరు, ఢిల్లీ, జమ్ముకాశ్మీర్‌లో ఒకరిని అరెస్టు చేశారు. ఐసిస్ ఉగ్రవాదానికి సంబంధించి గత ఏడాది నమోదు చేసిన కేసుల్లో 21 కేసులు జీహాది ఉగ్రవాదానికి సంబంధించినవి. నకిలీ కరెన్సీ కేసులు ఐదు, ఈశాన్యరాష్ట్రాల్లో చొరబాటు కేసులు నాలుగు, రెండు మావోయిస్టు కేసులను ఎన్‌ఐఏ నమోదు చేసింది. ఎన్‌ఐఏ 2016లో మొత్తం 22 కేసుల్లో చార్జిషీట్‌లను నమోదు చేసింది. ఇందులో ఎనిమిది కేసుల్లో కోర్టులు తీర్పులను వెలువరించాయి. వీటిలో ప్రధానమైన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు హైదరాబాద్ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష ఖరారు చేసింది. వీరంతా ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. దేశంలోని వివిధ కోర్టులు 8 కేసుల్లో 62 మందికి శిక్షను విధించాయి. ఉగ్రవాదులుగా అనుమానిస్తూ అరెస్టు చేసిన 52 మందిలో మూడో వంతు మంది (20 మంది) గ్రాడ్యుయేట్లు ఉండగా, 60 శాతం మంది మధ్య, ఎగువ తరగతి వర్గానికి చెందిన వారు ఉన్నారని ఎన్‌ఐఎ వివరించింది.