తెలంగాణ

అన్ని పిజి కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో అన్ని పిజి పరీక్షలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఇలాంటి ప్రయత్నం చేయగా, భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకున్న ఉన్నత విద్యామండలి వైస్ ఛాన్సలర్ల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. విసిలు సైతం సానుకూలంగా స్పందించడంతో అన్ని విశ్వవిద్యాలయాల్లోని పిజి సంప్రదాయ కోర్సులకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. కొన్నిసబ్జెక్టులకు ఉస్మానియా యూనివర్శిటీ, కొన్ని సబ్జెక్టులకు కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. ఈ ర్యాంకు ఆధారంగానే అన్ని యూనివర్శిటీల్లో ఉమ్మడి ప్రవేశాలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు.