తెలంగాణ

ప్రయాణికుల భద్రతే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవరి 20: రైల్వే ఆస్తులను పరిరక్షించడంతో పాటు ప్రయాణీకుల భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆర్‌పిఎఫ్ ఐజి, చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ సంజయ్ సంకృత్యాయన్ స్పష్టం చేశారు. అదనపు చీఫ్ సెక్యురిటీ కమీషనర్ జిఎం.ఈశ్వర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన రైల్ నిలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, నేరాల అదుపులో తమ సిబ్బంది పురోగతి సాధించారని, అయినప్పటికీ ఈ విషయంలో ప్రయాణికుల సహకారం కూడా ఎంతో అవసరమని, అనుమానాస్పదమైన సమాచారం ఏమైనా ఉంటే ప్రయాణాన్ని ఆపుకోకుండానే టోల్‌ఫ్రీ నెంబర్ 182కి తెలియజేయవచ్చని తెలిపారు. ప్రయాణ సమయంలో ఎవరైనా తమ పట్ల గానీ, తోటి ప్రయాణికుల పట్ల గానీ ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళల పట్లగాని దురుసుగా, అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే పై నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందజేయాలని సూచించారు. గత ఏడాది 600కు పైగా కేసుల్లో 800 మందికి పైగా నిందితులను అరెస్టు చేయడంతో పాటు రైల్వే నిబంధనలను అతిక్రమించిన 1,09,695 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.1.49 కోట్ల అపరాధ రసుము వసూలు చేశామన్నారు.
అలాగే అక్రమంగా తరలిస్తున్న 6,01,70,281 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ శాఖకు జిఆర్‌పికి స్వాదీనం చేశామన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌పిఎఫ్ ఐజి సంజయ్ సంకృత్యాయన్