తెలంగాణ

విత్తన చట్టంతోనే నకిలీల ఆటకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతినగర్, జనవరి 20: వ్యవసాయంపై ప్రేమ కురిపిస్తున్న ప్రభుత్వం నకిలీ మిరప, పత్తి తదితర విత్తనాలను అడ్డుకునేందుకు కొత్త విత్తన చట్టం తీసుకురావాలని రాజకీయ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు భూసేకరణ పేరుతో కొత్తకొత్త చట్టాలు తీసుకువస్తున్న ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టే విషయంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. వడ్డెపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలోని దొడ్డికొమరయ్య ప్రాంగణంవద్ద క్రాంతిదళ్ నాయకుడు నగేష్‌యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం మిరప, పత్తి, కూరగాయల నకిలీ విత్తనాలపై నడిగడ్డ రైతు గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదండరాం, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, రిటైర్ట్ జస్టిస్ చంద్రకుమార్, క్రాంతిదళ్ వ్యవస్థాపకులు పృధ్విరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దఎత్తున మిరప రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ వ్యవసాయంపై సమగ్ర విత్తనచట్టం తేవాలని, నకిలీ విత్తనాలను సరఫరా చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తన చట్టం ఎప్పుడో 1966 సంవత్సరంలో తయారైనదేనని, భూ సేకరణ కోసం చాలాసార్లు చట్టాలు మార్చారుకాని విత్తన చట్టాన్ని మాత్రం మార్చడం లేదన్నారు. వెంటనే కొత్తచట్టం తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులను ప్రతి ఒక్కరు అవమానపరుస్తున్నారని, దీనిని ఎదుర్కొనేందుకు రైతు సంఘాలు ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక విధానం మాదిరిగానే వ్యవసాయ విధానం ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేసి అలంపూర్ రైతుల కళ్లల్లో వెలుగులు నింపుతామన్నారు. నకిలి మిరప విత్తనాలతో నష్టపోయిన రైతుల కోసం రెండున్నర నెలలుగా పోరాడుతూంటే కలెక్టర్, వ్యవసాయ కమిషనర్ విత్తన డీలర్లను అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడంతో మంత్రులు, అధికారులు ఉరుకులు, పరుగులతో 11 బృందాలతో గ్రామాలలో పర్యటిస్తాయని ప్రకటించారని అన్నారు. రిటైర్ట్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రైతుల నష్టం వాటిల్లినప్పుడు వారికి ఆదుకునేలా చట్టాలను రూపొందించాలని అన్నారు.

చిత్రం..నడిగడ్డ రైతుగర్జనలో మాట్లాడుతున్న రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్