తెలంగాణ

ఎమ్సెట్-2017 కన్వీనర్‌గా యాదయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్య యుజి, పిజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్షల తేదీలను ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు కన్వీనర్లను సైతం ఖరారు చేసింది. వివిధ సెట్‌లను నిర్వహించే కన్వీనర్ల , చైర్మన్ల పేర్లను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ కె వెంకటాచలం, ప్రొఫెసర్ శంకశాల మల్లేష్, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావులతో కలిసి పాపిరెడ్డి పాత్రికేయులతో మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు టిఎస్‌ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీం పరీక్ష మే 12వ తేదీ ఉదయం, సంప్రదాయ మెడికల్ కోర్సులు, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ విభాగంలో చేరేందుకు మే 12వ తేదీ సాయంత్రం టిఎస్ ఎమ్సెట్ మెడికల్ ప్రవేశపరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి కన్వీనర్‌గా జెఎన్‌టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య వ్యవహరిస్తారు.
డిప్లొమో హోల్డర్లు, బిఎస్సీ గ్రాడ్యూయేట్లు ఇంజనీరింగ్‌లో నేరుగా రెండో సంవత్సరం చేరేందుకు టిఎస్‌ఇసెట్‌ను మే 6వ తేదీన నిర్వహిస్తారు. దీనికి కన్వీనర్‌గా జెఎన్‌టియుకు చెందిన ప్రొఫెసర్ ఎ గోవర్ధన్ వ్యవహరిస్తారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరేందుకు పిఇసెట్ మే 16న నిర్వహిస్తారు. దీనికి కన్వీనర్‌గా ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ వి సత్యనారాయణ వ్యవహరిస్తారు. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్‌ను మే 18న నిర్వహిస్తారు. దీనికి కాకతీయ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ కె ఓం ప్రకాష్ కన్వీనర్‌గా ఉంటారు. న్యాయవిద్యా కోర్సుల్లో చేరేందుకు లాసెట్ యుజి మే 27న లాసెట్ పిజి మే 27న నిర్వహిస్తారు.దీనికి కన్వీనర్‌గా కాకతీయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం వి రంగారావు వ్యవహరిస్తారు. ఎడ్‌సెట్‌ను మే 28న నిర్వహించాలని తొలుత భావించినా తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టారు. తేదీ మారే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ తదితర పిజి కోర్సుల్లో చేరేందుకు పిజిఇసెట్‌ను మే 30న నిర్వహిస్తారు. దీనికి కన్వీనర్‌గా ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సాయిదా సమీన్ ఫాతిమా వ్యవహరిస్తారు. ఎమ్సెట్‌ను జెఎన్‌టియు హైదరాబాద్, ఇసెట్‌ను జెఎన్‌టియు హైదరాబాద్, పిఇ సెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఐసెట్‌ను కాకతీయ వర్శిటీ, లాసెట్, పిజి లాసెట్‌లను కాకతీయ విశ్వవిద్యాలయం, ఎడ్‌సెట్, పిజి ఇసెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్లు చైర్మన్లుగా ఉంటారు.
రెండు పరీక్షలు ఆన్‌లైన్‌లో
నేటి ఎస్ పిజి ఇసెట్ , టిఎస్ ఇసెట్ పరీక్షలను ఈసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు.