తెలంగాణ

సింగరేణి డిపెండెంట్ వయో పరిమితి ఇక 40ఏళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: సింగరేణి డిపెండెంట్ ఉద్యోగుల గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచినట్టు సింగరేణి సంస్థ చైర్మన్, ఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో ఈ మేరకు వయో పరిమితి పెంచినట్టు చెప్పారు. వాలంటరీ రిటైర్‌మెంట్ ద్వారా వారసులకు ఉద్యోగాలు కల్పించే పథకాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో సింగరేణిలో పునరుద్ధరించారు. వారసత్వ ఉద్యోగం కోరే అభ్యర్థి వయసు 35 ఏళ్లు ఉండాలని తొలుత నిర్ణయించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో వయో పరిమితి పెంచాలనే సూచనలు రావడంతో, సిఎం 40 ఏళ్లకు పెంచాలని ఆదేశించారు. సింగరేణిలోని అన్ని ఏరియాలకు సర్క్యూలర్‌ను విడుదల చేస్తున్నట్టు సంస్థ చైర్మన్ తెలిపారు. అర్హత పొందిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.