తెలంగాణ

మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: మాజీ సైనికుల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మరే రాష్ట్రంలో లేనివిధంగా మాజీ సైనికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మాజీ సైనికుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అసెంబ్లీలో కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమ సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల కృతజ్ఞతలు తెలిపేందుకు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతరావు ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు మాజీ సైనికోద్యోగులు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు కెసిఆర్‌కు కృతజ్ఞతపూర్వకంగా ఆర్టిలరీ మోడల్ గన్‌ను బహుకరించారు. సైనికుల సేవలను అందరూ కొనియాడే వారే తప్ప తమ సంక్షేమం గురించి ఆలోచించిన వారే లేకపోయారని, తమ గురించి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనని వారు కొనియాడారు. తమ కోసం నిర్ణయాలను తీసుకున్న ముఖ్యమంత్రిని చూసి గర్వపడుతున్నామని, కెసిఆర్‌లో ఓ కమాండర్‌ను చూసుకున్నామని వారు భావోద్వేగానికి లోనయ్యారు.

చిత్రం..సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మాజీ సైనికులు