రాష్ట్రీయం

రేపు తెలంగాణ మంత్రివర్గం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ శాసనసభలో బడ్జెట్‌ను సోమవారం ప్రవేశ పెట్టనుండటంతో ఆ ముందు రోజు ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు దానిని మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. బిఎసిలో ఖరారు చేసిన శాసనసభ సమావేశాల తేదీలపై చర్చించడంతో పాటు సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది.