తెలంగాణ

తగ్గుతున్న మరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నా..మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి. వీటిని మరింత తగ్గించేందుకు రోడ్డు భద్రతా విభాగం (రోడ్ సేఫ్టీ అథారిటీ) ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే చేపట్టిన రోడ్డు భద్రతా వారోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. రాష్ట్రంలో 2015లో రోడ్డు ప్రమాదాల కారణంగా 7,110 మంది మరణించగా, 2016లో 6,910కు తగ్గాయి. అయితే ఇదే క్రమంలో ప్రమాదాలు పెరిగాయి. 2015లో 17,999 ప్రమాదాలు జరగ్గా, మరుసటి ఏడాదికి ఇవి 19,395కు పెరిగాయి. అంటే మరణాలు తగ్గినట్టేనని అదనపు డిజిపి (రైల్వే, రోడ్డుసేఫ్టీ) కృష్ణప్రసాద్ ఆదివారం మీడియాకు తెలిపారు. అయితే మరణాలు జాతీయ, రాష్ట్రీయ రహదారులపైనే ఎక్కువ జరుగుతున్నాయని, అందుకే ఈ రహదారులపైనే ఎక్కువ దృష్టి సారించామని, నిజామాబాద్, రామగుండం, వనపర్తి, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యవేక్షణ పెంచారు.
2014లో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై 49 వేల కేసులు నమోదు చేసి రూ. 95 కోట్ల జరిమానా రుసుము వసూలు చేయగా, 2016లో 68 వేల కేసులు చేసి రూ. 119 కోట్లు వసూలు చేశారు.
పర్యవేక్షణ పెరగడంతో మరణాలు తుగ్గముఖం పట్టాయి. 2014లో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి లక్ష మంది జనాభాకు 34.5 శాతం మంది మరణించగా, 2015 నాటికి 33.5కు, గత ఏడాది 31కి తగ్గాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, వాహనంలో పరిమితికి మించి సరకు నింపుకోవడం వంటివి ప్రమాదాలకు కారణమయ్యాయి. ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలపై ప్రపంచ బ్యాంక్ కూడా తన సహాయం అందిస్తోంది. ఇందులో భాగంగానే రోడ్డు భద్రతా సంస్థకు ప్రపంచ బ్యాంకు రూ. 36 కోట్లు మంజూరు చేయగా, హైదరాబాద్-బీజాపూర్ రహదారిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ప్రమాదాల నివారణకు ఇప్పటికే ఈ రహదారిపై రెండు హైవే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కో ఇంటర్‌సెప్టర్, రెండేసి గస్తీ వాహనాలు అందించినట్టు అదనపు డిజిపి పేర్కొన్నారు.
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు గుర్తించి అభివృద్ధి చేయడంతోపాటు ప్రమాదం జరిగితే సత్వర చికిత్స అందించేలా ట్రామాకేర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పోలీస్ స్టేషన్లను రాష్ట్రంలోని హైవేలపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు రోడ్డు భద్రత సంస్థ ప్రతిపాదించింది.