తెలంగాణ

వీకెండ్‌లో ఘోర ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: హైదరాబాద్‌లో ప్రతీ వారాంతంలోనూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వారాంతంలో జరిగే ప్రమాదాల్లో ఒక,రెండు మరణాలు, నలుగురైదుగురు తీవ్రంగా గాయపడడం సాధారణమై పోయింది. తాజాగా ఆదివారం జరిగిన వీకెండ్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదర్‌గూడ దగ్గర పివీ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి మెహిదీపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లో అతివేగంగా వెళ్తూ ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఏపి 11జె 008 నంబర్ గల కారు ఎన్టీఆర్ భవన్ వైపు నుంచి జూబ్లీహిల్స్‌కు వెళ్తూ, జూబ్లిహిల్స్ చెక్‌పోస్టు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.
మరో ఘటన షంషేర్ గంజ్‌లో చోటుచేసుకుంది. పాతబస్తీలోని షంషేర్ గంజ్ వద్ద అటో ఢీకొని ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులో తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడు పహాడిషరీఫ్‌కు చెందిన జంగయ్యగా గుర్తించారు.