తెలంగాణ

సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: దేశంలో ఆరోగ్యకర సమాజం ఏర్పడాలంటే పంట దిగుబడులు తగ్గకుండా రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని హాకా భవనంలో తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ ధ్రువీకరణ అథారిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మారుతున్న పరిస్థితులు, ఆరోగ్యం పట్ల అవగాహనతో ప్రజలు సేంద్రీయ ఉత్పత్తుల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ధరలు ఎక్కువైనా వినియోగదారులు సేంద్రీయ ఆహారోత్పత్తులపై వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారని, రైతులు కూడా రసాయనాలపై అధికంగా ఖర్చు చేయకుండా సహజంగా దొరికే ఎరువులను వాడి ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం కూడా సేంద్రీయ సాగును ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దేశంలో ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యాలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని , దీనికి రసాయనిక ఆహారోత్పత్తులు కూడా ఒక కారణమని అన్నారు. చిన్న రాష్టమ్రైనా సిక్కిం నూరు శాతం సేంద్రీయ ఉత్పత్తులతో దేశంలోనే అగ్రగామిగా ఉందని, అక్కడ ఆస్పత్రుల బెడ్‌లు ఖాళీగా ఉంటున్నాయని పోచారం తెలిపారు. తాను వ్యవసాయం చేసినన్ని రోజులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం సహజ సిద్ధంగా లభించే వ్యర్థాలనే ఎరువులుగా వాడి మంచి ఉత్పత్తులు సాధించానని పోచారం తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకు, ఉత్సాహవంతులకు ఈ అథారిటీ అండగా నిలుస్తుందని, వారి ఉత్పత్తులకు ధ్రువీకరణ పత్రం ఇస్తుందని, దీని వల్ల మంచి ధర లభిస్తుందని మంత్రి చెప్పారు. సేంద్రీయ వ్యవసాయంపై సిడి, ప్రచార పోస్టర్లను,కర పత్రాన్ని ఈ సందర్భంగా మంత్రి విడుదల చేశారు. వ్యవసాయ శాఖ సెక్రటరీ పార్థసారథి, కమిషనర్ జగన్ మోహన్, ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, సీడ్ సర్ట్ఫికెట్ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో రాష్ట్ర సేంద్రీయ ధ్రువీకరణ అథారిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి పోచారం