తెలంగాణ

అధికారికంగా సేవాలాల్ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ ఏర్పడిన తరువాత అంతా ఆత్మగౌరవంతో తమ పండుగలు జరుపుకుంటున్నారని, ఫిబ్రవరి 15న రాష్ట్ర వ్యాప్తంగా లంబాడి ఆథ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. తెలంగాణలో గిరిజన పవిత్ర స్థలాలు, జాతరలు పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. సేవాలాల్ జయంతిని ఆధికారికంగా నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలకు కోటి రూపాయలు విడుదల చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గిరిజన జాతరకు సముచిత గౌరవం లభించాలని అన్నారు. మసాబ్ ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ లక్ష్మణ్ మాట్లడుతూ ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి లంబాడి జనాభా ఆధారంగా నిధులు అందించనున్నట్టు చెప్పారు.నామా నాయక్, డాక్టన్ నవీన్ నికోలస్, డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. గిరిజన నాయకులు భూక్యా మంగీలాల్ నాయక్, రాథోడ్ ప్రకాశ్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.