ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర నిధులు వాడేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 1: రాష్ట్భ్రావృద్ధికి అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. కేంద్రం నుంచి రావలసిన అన్నిరకాల నిధులు రాబట్టాలని నిర్ణయించింది. వివిధ పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరం 2016-17లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నిటినీ పూర్తిగా వినియోగించుకోడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక రెండు నెలలే సమయం ఉంది. ఈకాలంలోనే కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే 31 పథకాలతో పాటు ఇతర నిధులకు సంబంధించిన పనులను పూర్తిచేయాలి. వీటికితోడు 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఖర్చుచేసి ఆ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పథకానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ఒక్కో పథకానికి ఒక్కో నిష్పత్తిలో కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కేంద్రం నిధులు అందించే వాటిలో ఎంజిఎన్‌ఆర్‌ఈజీఏ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం), గృహ నిర్మాణం (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన), సర్వశిక్ష అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్, స్మార్ట్ సిటీలు, జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం, జాతీయ ఆరోగ్య మిషన్, ఐసిడిఎస్, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, సమగ్ర నీటి సరఫరా పథకం, నేషనల్ అర్బన్ మిషన్, ప్రధాన మంత్రి క్రిషి సించారుూ యోజన, రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ వంటి పథకాలున్నాయి. అంతేకాకుండా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు మంజూరు చేసింది. అమరావతిని వారసత్వ నగరంగా ప్రకటిస్తూ కేంద్రం ‘హృదయ్’ (హెరిటేజ్ సిటీస్ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్యుమెంటేషన్ యోజన) పథకం కింద రూ. 22.26 కోట్ల నిధులు మంజూరు చేసింది.
దాదాపు అన్ని శాఖల్లో కేంద్రం ఆర్థిక సహాయం అందించే పథకాలు అనేకమున్నాయి. వాటిలో చాలావరకు చివరి దశకు వచ్చాయి. అయితే ఇంకా పలు శాఖల్లో పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఈ రెండు నెలల్లోగా ఈ పనులు పూర్తిచేస్తేనే కేంద్ర నిధులు విడుదల చేస్తుంది. లేకపోతే అవి మురిగిపోయే ప్రమాదముంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పనులన్నిటినీ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా కేంద్రంతో జతపడి ఉన్న పనులు పూర్తికావడానికి నిష్పత్తి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేయాలి. చాలా పథకాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంజూరు చేయవలసిన నిధులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే మంజూరు చేస్తామని, ఆ పనులను ఈ రెండు నెలల్లోపు పూర్తిచేయాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం జరిగిన ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. పనులు పూర్తిచేయడం ద్వారా కేంద్రం నుంచి రావలసిన నిధులను పూర్తిగా రాబట్టాలని చెప్పారు. సంబంధించిన పనులను కూడా ఆయన సమీక్షించారు. నిధుల వినియోగానికి సంబంధించి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. మంత్రులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మనలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారమేనని, అందరూ మనసుపెట్టి గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని యనమల కోరారు. ఇళ్లు లేని నిరుపేదలకు గృహవసతి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఇళ్ల నిర్మాణ వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నందున కేంద్ర పథకాలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసే పనుల్లో ఆర్థిక శాఖ నిమగ్నమైంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులతోపాటు అవసరమైన పథకాలకు అదనపు నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అలాగే మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేసి కేంద్ర నిధులను పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది.