తెలంగాణ

హైదరాబాద్‌కు వన్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఏక్ భారత్ శ్రేష్ట భారత్ పిలుపును పురస్కరించుకుని అహమ్మదాబాద్‌కు చెందిన ఐదుగురు మిత్రుల బృందం దేశంలో 29 రాష్ట్రాలను పర్యటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒన్ ఇండియా పేరిట యాత్ర నిర్వహిస్తున్న ఈ బృందం గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ బృందంలో మహేంద్ర పటేల్, సత్యేన్ ఇంజనీర్, అనిల్ గెమావత్, అర్చిత్ ప్రజాపతి ఫోర్ట్ ఎండీవర్ వాహనంలో, అల్పేష్ షా అనే వ్యక్తి ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌పై 14819 కిమీ దూరాన్ని 29 రోజుల్లో పూర్తి చేయాలని సంకల్పించారు. ఇంతవరకు 4800 కిమీ ప్రయాణం చేసి తాము హైదరాబాద్‌కు చేరుకున్నామని అల్పేష్ షా తెలిపారు. ఇంతవరకు ఏడు రాష్ట్రాలు, వాటి రాజధానుల్లో పర్యటించి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు వచ్చామన్నారు. హారన్ ఎందుకు అనే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు సత్యేన్ ఇంజనీర్ తెలిపారు. ప్రజల్లో అధికంగా హారన్ ఉపయోగించం అని ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్లు చెప్పారు. నగర ప్రజల్లో వినికిడి సమస్యతో పాటు రోడ్లు శబ్ద కాలుష్యంగా ఉంచడం, ఒత్తిడి చికాకు, కలత నిద్ర, రక్తపోటు వంటి ఇతర రుగ్మతలు వస్తాయన్నారు. వివిధ భౌగోళిక ప్రాంతాల్లో భిన్న సంస్కృతులు విరాజిల్లుతున్నా ఒకే దేశంగా ఉండడం గొప్ప ఆలోచనను వన్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ నెల 23వ తేదీన గాంధీనగర్‌లో ఈ యాత్రను ముగిస్తామన్నారు. ఒన్ ఇండియా యాత్రలో భాగంగా వచ్చిన వీరిని అమిగో అటస్ సంస్ధ సిఇవో ధీరజ్ స్వాగతం పలికారు.

చిత్రం..హైదరాబాద్ రోడ్లపై వన్‌ఇండియా బృందం