తెలంగాణ

విత్తనాభివృద్ధికి సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రంలో విత్తనాభివృద్ధికి సహకరిస్తామని జర్మనీ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ‘ఇండోజర్మన్ కోఆపరేషన్ ఆన్ సీడ్ సెక్టార్ డెవలప్‌మెంట్’ లో భాగంగా జర్మన్‌కు చెందిన అధికారిక బృందం గురువారం హైదరాబాద్ వచ్చింది. ఈ బృందంతో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు చర్చలు జరిపారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు సహకరిస్తామని జర్మనీ ప్రతినిధులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జర్మనీ తరపున జర్మన్ ప్రాజెక్ట్ టీం లీడర్ ఎక్కార్డ్ ష్రోడర్, ఇండోజర్మన్ నేషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ సౌమిని సుంకర, తెలంగాణ వ్యవసాయ కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ కమిషనర్ జగన్‌మోహన్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ డాక్టర్ ప్రవీణ్‌రావు, సీడ్ సర్ట్ఫికేషన్ ఏజన్సీ డైరెక్టర్ కేశవువులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జర్మనీ ప్రతినిధిని సన్మానిస్తున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి