తెలంగాణ

నేడే ఇన్‌కాయిస్ 18ఏళ్ల వార్షికోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్ (ప్రగతి నగర్, కూకట్‌పల్లి) లోని ఎస్సో-ఇన్‌కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ అండ్ ఇన్‌ఫర్మేషన్ సర్వీసెస్) ఏర్పాటై 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సంస్థ ప్రకటించింది. ఇన్‌కాయిస్ డిప్యూటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కెకెవి చారి ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సముద్ర శాస్త్రానికి సంబంధించిన పరిశోధన ఈ సంస్థ చేస్తోంది. సునామి తదితర ప్రకృతి వైపరీత్యాల గురించి ఈ సంస్థ ముందుగానే హెచ్చరిస్తోంది. సముద్రశాస్త్రానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఈ కేంద్రంలో అధునాతన యంత్రాలు, పరికరాలను ఏర్పాటు చేశారు.