తెలంగాణ

ఆత్మహత్యలు ఆగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, విధానాలు మారకపోవడంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ రైతు సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యలు-నివారణ అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం అధ్యక్షుడు పి.జంగారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో చర్చ జరిగింది. రైతుఆత్మహత్యల నివారణకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమిటో తెలియచేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు, రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ఇప్పటి వరకు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్, జయతీఘోష్ కమిషన్, జస్టిస్ రాంచెన్నారెడ్డి కమిషన్, జస్టిస్ పిఎ చౌదరి కమిషన్, ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ ఏర్పాటయ్యాయని వివరించారు. ఈ కమిషన్లు ఇచ్చిన నివేదికలను ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని, నివేదికలు బూజు పట్టిపోతున్నాయని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రాష్ట్రప్రభుత్వాలు ఆరులక్షల రూపాయల వరకు పరిహారం చెల్లిస్తామన్నప్పటికీ, 100మందికి కూడా అందలేదన్నారు. నష్టపరిహారం కోసం 13రకాల సర్ట్ఫికెట్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ని సర్ట్ఫికెట్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. రైతు ఆత్మహత్యలను నిరోధించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ప్రభుత్వమే ఇవ్వాలని, వడ్డీలేకుండా పంటరుణాలు ఇవ్వాలని, పంటలు వేసే ముందే ఆ యా పంటలకు ధరలను ప్రకటించాలని, మార్కెట్లో నిర్ణీత ధర కన్నా తక్కువ ఇస్తే, మిగతాభాగం ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా యుద్ధప్రాతిపదికన గణాంకాలు సేకరించి రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే భరించాలని, పంటల ఎగుమతులు, దిగుమతుల వల్ల ధరలు తగ్గకుండా చర్యలు చేపట్టాలని, రాష్ట్ర అవసరాలమేరకు పంటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, బీడుభూములను సాగులోకి తేవాలని, వ్యవసాయ భూములను వ్యవసాయేత పనులకు మార్చకుండా చట్టం చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది.