తెలంగాణ

ప్రభుత్వ వైఖరిపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువత పోరాటానికి సిద్ధమైంది. నిరుద్యోగ యువతతో ఈ నెల 22న రాష్ట్ర రాష్టర్రాజధానిలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజాక్) నిర్ణయించింది. టిజాక్ కేంద్ర కార్యాలయంలో కేంద్ర స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. సమావేశం తర్వాత కోదండరాం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నవి ప్రధాన అంశాలని గుర్తుచేశారు. నిరుద్యోగ యువత అన్ని జిల్లాల నుండి భారీగా తరలి రావాలని కోదండరాంతో పాటు టిజాక్ కన్వీనర్ పిట్టల రవీందర్ తదితరులు కోరారు. తెలంగాణ ఏర్పాటై రెండున్నరేళ్లు గడిచిపోయినప్పటికీ ఉద్యోగాల భర్తీ యుద్ధప్రాతిపదికన జరగడం లేదన్నారు. ఉద్యోగాలు లభించని యువత వయస్సు గరిష్ట అర్హతను దాటిపోతోందన్నారు. ప్రభుత్వం అడుగుడుగునా యువతను మభ్యపెడుతోందని, ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 15వేలు మాత్రమేనన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉందన్నారు.
నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులు, యువత నేడు ఉద్యోగాల భర్తీ కోసం రోడ్లపైకి రావలసి వస్తోందన్నారు. యువత తీవ్రమైన నిరాశా, నిస్పృహలకు గురై ఉన్నారన్నారు. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం రాజధానిలో కోచింగ్ తీసుకున్న యువత ఇళ్లకు వెళ్లలేక, రాజధానిలో ఉండలేక సతమతమవుతున్నారన్నారు. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానాలేనని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు సక్రమంగా లేదని, టిజాక్ నేతలు ఆరోపించారు. టిజాక్ నేతలను పోలీసులు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భావస్వేచ్ఛ ప్రకటన భారత రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కన్న విషయం కూడా ప్రభుత్వం మరిస్తే ఎలా అంటూ వారు నిలదీశారు. పోలీసులు, ప్రభుత్వ తీరును ఖండించారు. సమాజంలో ఎవరైనా సంఘాలు, పార్టీలు ఏర్పాటు చేసుకోవచ్చని, ఇది పోలీసులో, మరెవరో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యమం చేయడం ప్రజల ప్రాథమిక హక్కులో భాగమేనని స్పష్టం చేశారు. ఉపాధి అంశంలో చర్చలకు ప్రభుత్వం పిలిస్తే వెళతామని ప్రకటించారు.

చిత్రం..గురువారం హైదరాబాద్‌లో గోడ ప్రతులను ఆవిష్కరిస్తున్న కోదండరాం