తెలంగాణ

ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: దేశంలో ఎన్నికల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రాబోయే రోజుల్లో దేశంలో పెద్ద ఎత్తున ఎన్నికల సంస్కరణలు రానున్నాయని ఆయన చెప్పారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు రెండువేల కంటే ఎక్కువ మొత్తం నగదు రూపంలో చెల్లించకుండా ఆంక్షలు విధించిందని, తద్వారా ఎన్నికల సంస్కరణలకు నాంది పలికినట్లయిందని అన్నారు. ఎక్కువ మొత్తం చెల్లించేవారు చెక్కుల రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుందని, ఎన్నికల సంఘం చేసిన సిఫార్సులను అమలుచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు బాగా నిధులు వచ్చాయని అన్నారు. ఫ్లోరైడ్ నియంత్రణకు 1600 కోట్ల రూపాయలు కేటాయించారని, తెలంగాణలో ఉపాధి కల్పనకు 2145 కోట్లు, హైదరాబాద్‌లో అభివృద్ధి కల్పనకు 284 కోట్లు కేటాయించారని, విజ్ఞాన సంస్థలు, ఐఐటిలకు 162 కోట్లు కేటాయించారన్నారు. రైల్వేలకు సంబంధించి 170కాపలా లేని గేట్లు పనిచేసే విధంగా చర్యలు చేపట్టారని, సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఉపాధి కల్పనకు అవకాశం ఇచ్చి వౌలిక వసతుల కల్పనకు లక్షా 31వేల కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి చెప్పారు.
మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గత ఏడాది కంటే ఎక్కువగా 48వేల కోట్ల రూపాయలు కేటాయించారని, దీని ద్వారా కరవు ప్రాంతాల్లో ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. వ్యవసాయ రుణాల కోసం 10వేల కోట్ల రూపాయలు కేటాయించడం చరిత్రాత్మకమని చెప్పారు. ముద్రారుణాలు, మైక్రో ఫైనాన్స్ కోసం గతంలో కంటే ఎక్కువగా 2లక్షల 44వేల కోట్ల రూపాయిలు కేటాయించడం జరిగిందని అన్నారు. దీనిద్వారా అనేక మందికి రుణాలు అందించడమే కాకుండా ఉపాధి లభిస్తుందని అన్నారు. నైపుణ్యాల అభివృద్ధికి 4వేల కోట్ల రూపాయలతో సంకల్పనిధి ఏర్పాటు చేయడంతో ఉపాధి శిక్షణ ఇచ్చే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. నిజాయితీగా పన్ను కడుతున్న వారికి మేలు చేసే విధంగా 2.5 లక్షల నుండి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ రేట్‌ను10 శాతం నుండి 5 శాతానికి తగ్గించారని , దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే చర్యగా ఆయన అభివర్ణించారు.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు పన్ను చెల్లించే వారి శాతం 34.85శాతం పెరిగిందని, దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం దక్కుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న 10 రంగాల్లో కార్మిక మంత్రిత్వశాఖ కూడా ఉందని, నిర్మాణ రంగానికి ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారని, 5 లక్షల మంది ముస్లింలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇస్తారని అన్నారు.