తెలంగాణ

ముందే వచ్చిన వేసవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతుండడంతో వేసవి కాలం వచ్చేసినట్లు ఉంది. రోజు రోజుకీ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వేసవిలో అడుగుపెడుతున్నట్లు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటోంది. మరోవైపు చలి తీవ్రత కూడా ఈ రోజుల్లో సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి వెళ్లే వరకు చలి తీవ్రత సాధారణంగా కొనసాగుతుంది. అయితే ఈ నెల 24 శివరాత్రి కాగా ఇప్పటికే వేడి వాతావరణం పెరగడం కనిపించింది. చలి తీవ్రత తగ్గడం, మరో వైపు వేడి పెరగడంతో వేసవి వచ్చేసిందా అని అంతా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో గాను 19 జిల్లాల్లో ఈ నెల 10 నాటికి గరిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్ నుంచి 35 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది.
రాత్రి వేళల్లో కనిష్టంగా 14 డిగ్రీల నుంచి 18 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జోగులాంబ- గద్వాల, నల్గొండ, యాదగిరి-్భవనగిరి, సూర్యాపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో రాగల వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కొమురం భీం-ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జయశంకర్-్భపాలపల్లి జిల్లాల్లో 10వ తేదీ నాటికి రాత్రి వేళల్లో కనిష్టంగా 13 డిగ్రీల సెల్సియస్ నుంచి 17 డిగ్రీల వరకు, పగలు గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 34 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌లో శుక్రవారం పగటి గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు నమోదు అయింది. దీంతో రాగల వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.