తెలంగాణ

వేసవిలో నీటికి ఢోకాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఈ ఏడాది వేసవిలో తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాల కోసం ఆందోళన అవసరం లేదు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జల మట్టం బాగా మెరుగుపడింది. ఈ ఏడాది అతి వర్షపాతం ప్రభావం వల్ల భూగర్భ జల మట్టం పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సరాసరి లెక్కిస్తే ఈ ఏడాది జనవరి నాటికి 4.11 మీటర్ల భూగర్భ జల మట్టం వృద్ధి చెందిందని తేలింది. భూగర్భ జల శాఖ రాష్ట్రంలోని 584 మండాల్లో కొన్ని ప్రయోగాత్మక బావుల ద్వారా చేపట్టిన ప్రతి నెల పరిశీలనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ పరిశీలనలో 2016 జనవరిలో 13.44 మీటర్లు రాష్ట్ర సరాసరి నీటి మట్టం నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నాటికి 9.34 మీటర్లుగా నమోదయ్యింది. దీంతో 4.11 మీటర్ల భూగర్భ జల మట్టం పెరిగినట్లు భూగర్భ జల శాఖ గుర్తించింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మే నాటికి 11.40 మీటర్లు ఉండబోగలదని అంచనా వేసింది. ఈ ఏడాది జనవరి నాటికి సాధారణ వర్షపాతం 850 మిల్లీమీటర్లకు గాను 1001 మిల్లీమీటర్లుగా నమోదైంది. దీంతో 18 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో భూగర్భజల మట్టం పెరిగింది. హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువగా నమోదు అయ్యింది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. భూగర్భ జల వినియోగం కూడా పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి 2017 జనవరి వరకు రెండు నెలల్లో 0.84 మీటర్ల మేర భూగర్భ జల మట్టం తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది.
కొన్ని జిల్లాల్లో ఈ జనవరి నాటికి గరిష్టంగా భూగర్భ నీటి మట్టం పెరుగుదల వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో గరిష్ట నీటి మట్టం జనవరి మాసానికి 16.21 మీటర్లు ఉండగా, మెదక్ జిల్లాలో 16.02 మీటర్లు నమోదైంది. కాగా కనిష్ట నీటి మట్టం మంచిర్యాల జిల్లాలో 5.06 మీటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 1.55 మీటర్లు నమోదైంది. సగటు నీటి మట్టం ఈ ఏడాది జనవరి నాటికి మహబూబ్‌నగర్‌లో 13.72 మీ, నాగర్‌కర్నూల్‌లో 15.49 మీ, సిద్దిపేటలో 12.85 మీ, నిజామాబాద్‌లో 11.12 మీ, జనగాంలో 10.12 మీ, యాదాద్రి భువనగిరి జిల్లాలో 10.21 మీటర్లు నమోదైంది. మిగిలిన జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల మధ్య భూగర్భ జల మట్టం నమోదైంది.