తెలంగాణ

పెరిగిన పన్నుల వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సాలీనా వచ్చే కేంద్ర పన్నుల ఆదాయంలో వాటా పెరిగింది. 2017-18 సంవత్సరానికి ప్రస్తుత ఏడాది కంటే రూ. 1700 కోట్లను అదనంగా కేంద్రం కేటాయించింది. కేంద్రం నుంచి పన్నుల్లో వాటా, కేంద్రం ప్రకటించిన పథకాల అమలుకు, 14వ ఆర్థిక సంఘం నిధులు, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్లు, విపత్తుల నిర్వహణ నిధి కింద రాష్ట్రాలకు నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో పైన పేర్కొన్న పద్దులన్ని కలిపి మొత్తం రూ. 25,675 కోట్ల నిధులు తెలంగాణకు కేంద్రం కేటాయించింది. కేంద్రానికి వచ్చే మొత్తం పన్నుల వసూళ్ల ఆదాయంలో 42శాతం రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది కేంద్రానికి దాదాపు రూ. 6.74 లక్షల కోట్ల ఆదాయం పన్నుల ద్వారా వస్తుందని అంచనా వేసింది. ఇందులో తెలంగాణ వాటా రూ. 16,505 కోట్లుగా నిర్ణయించారు. 2016-17 బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రానికి తొలుత రూ. 13,900 కోట్లను కేటాయించింది. కాగా పన్నుల వసూళ్లలో వృద్ధి నమోదు కావడంతో ఆ తర్వాత అదనంగా రూ. 900 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసింది. కేంద్ర పథకాలకు సంబంధించి 2016-17లో ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేయగా, వచ్చే ఏడాదికి రూ.6600 కోట్లను కేటాయిస్తూ ప్రతిపాదించారు. మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎప్పటిలాగానే రూ.1718 కోట్లను కేటాయించారు. జాతీయ విపత్తు నిధి కింద రూ. 302 కోట్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక సాయం కింద రూ. 450 కోట్లను కేటాయించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్రానికి వచ్చే కేంద్రం నిధుల వాటాను పెంచాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.