తెలంగాణ

ఒత్తిడి లేని విద్యతో ఉత్తమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఒత్తిడి లేని విద్యతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని వక్తలు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో సృజనాత్మక శక్తి ఉంటుందని, దానిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలని అన్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఆదివారం సంజీవయ్య పార్కులో ‘విజరుూభవ వాక్‌థాన్’ నిర్వహించారు. క్యాబ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్, టివి9 సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ఇంటర్ బోర్డు కమిషనర్ అశోక్, ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ వెంకటేశం, మానసిన విశే్లషకులు వాక్‌థాన్‌లో పాల్గొన్నారు. విద్యార్థుల్లో మానసిక, శారీరక ఒత్తిడులను అధిగమించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని, పరీక్షలంటే భయపడకుండా చక్కటి ప్రణాళిక వేసుకుని, ప్రశాంతంగా ఉంటే విజయం సాధిస్తారని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ క్యాబ్ సంస్థ నిర్వాహకుడు వెంకటేశ్ బృందాన్ని కడియం అభినందించారు.