తెలంగాణ

భర్తీకాని ‘సెకండ్ పొజిషన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణ ప్రభుత్వం భూపరిపాల ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఎ) పోస్టును భర్తీలో తాత్సారం చేస్తోంది. రాష్ట్రంలో పరిపాలనాపరంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు తర్వాత సిసిఎల్‌ఎ పోస్టు కీలకమైంది. గతాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి ఎంపిక చేసుకున్న అధికారిని సిసిఎల్‌ఎ పోస్టులో నియమిస్తూ వచ్చారు. సమైక్య రాష్ట్రంలోనూ ఈ సంప్రదాయం కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పినట్టు అనిపిస్తోంది. సీనియర్ ఐఎఎస్ అధికారి రేమాండ్ పీటర్ 2016 లో సిసిఎల్‌ఎగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఈ పోస్టులో ఎవరినీ నియమించలేదు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రేమాండ్ పీటర్‌కన్నా ముందు అధర్‌సిన్హా కొంతకాలంపాటు సిసిఎల్‌ఎగా అదనపు బాధ్యతల్లో కొనసాగారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండున్నర ఏళ్లు గడవగా, సిసిఎల్‌ఎ పోస్టు దాదాపు ఒకటిన్నర-రెండు సంవత్సరాలపాటు ఖాళీగానే ఉంది. పరిపాలనాసౌలభ్యం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిసిఎల్‌ఎగా అదనపు బాధ్యతలు ఇస్తూ వస్తున్నారు. ఇంతకుముందు సిఎస్‌గా పనిచేసిన రాజీవ్‌శర్మ, 2016 డిసెంబర్ చివర్లో సిఎస్ పదవి నుండి రిటైర్డ్ అయిన కె. ప్రదీప్ చంద్ర సిఎస్ పోస్టుతోపాటు సిసిఎల్‌ఎగా అదనపు బాధ్యతల్లో కొనసాగారు. ప్రస్తుత సిఎస్‌గా కొనసాగుతున్న ఎస్‌పి సింగ్ కూడా సిసిఎల్‌ఎగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిఎస్‌గా కొనసాగే అధికారికి రాష్ట్రంలోని అన్ని శాఖలపై ఆధిపత్యం ఉంటుంది. ఏ శాఖలో ఏమైనప్పటికీ, సిఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటి సిఎస్‌కు సిసిఎల్‌ఎ బాధ్యతలు అప్పగించడంవల్ల ఈ పోస్టుకు న్యాయం జరగదని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రెవెన్యూ శాఖకు రాష్ట్ర పరిపాలనలో కీలకమైన భూమిక ఉంటుంది. జిల్లా కలెక్టర్లంతా సిసిఎల్‌ఎ పరిధిలోనే పనిచేస్తారు. జిల్లాస్థాయిలో ప్రభుత్వంలోని అన్ని శాఖలతో కలెక్టర్లకు సంబంధం ఉంటుంది. అంటే రాష్ట్ర పాలనలో సిఎస్ తర్వాత కీలకమైన భూమిక పోషించే పోస్టు సిసిఎల్‌ఎ పోస్టు. ఈ పోస్టులో పూర్తిస్థాయి అధికారి లేకపోవడం వల్ల పరిపాలనాపరంగా కొంత ఇబ్బందిగా ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
సిసిఎల్‌ఎ పోస్టును భర్తీ చేసేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారుల్లో ఒకరిని ఎంపిక చేస్తారు. తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు దాదాపు సమానమైన పోస్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టు. ప్రస్తుతం ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శులుగా ఎంజి గోపాల్, వినోద్ కె. అగ్రవాల్, సురేష్ చందా, సోమేష్‌కుమార్, అజయ్ మిశ్రా, రంజీవ్ రక్కర్ ఆచార్య, ఎస్‌కె జోషి, బిపి ఆచార్య తదితరులు కొనసాగుతున్నారు. వీరిలో ఎవరో ఒకరిని సిసిఎల్‌ఎ పోస్టులో నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.