తెలంగాణ

కలెక్టర్లూ శభాష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5:‘జిల్లాల అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక తయారు కావాలి. ఇప్పుడు మీ జిల్లా ఎలా ఉంది? పదేళ్ల తర్వాత ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించి, దాని ప్రకారం పనిచేయండి’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం 19.5 శాతం వృద్ధిరేటుతో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని, ఆర్థిక వనరులను సమకూర్చుకుని, వాటిని మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు. పట్టణ,గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితులను అవగతం చేసుకుని పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని హితవు చెప్పారు. ప్రగతి భవన్‌లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలపాటు కలెక్టర్లతో కెసిఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటు, పాలనా వికేంద్రీకరణ లక్ష్యాలుగా ఏర్పడిన కొత్త జిల్లాలవల్ల ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ఆకాంక్షించారు.
‘కలెక్టర్లు బాగా పని చేస్తున్నారు. కొత్త జిల్లాలు బాగా స్థిరపడాలి. సమస్యల పరిష్కారానికి ఉత్సాహంగా కృషి చేస్తున్నారు. ఇకముందు కూడా ఇలాగే పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకుంటామన్న పూర్తి నమ్మకం ఉంద’న్నారు. ప్రతి కలెక్టర్‌కు ప్రత్యేకంగా రూ.5 కోట్ల నిధులు కేటాయిస్తున్నాం. తమ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించడానికి ఈ నిధులు వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘మన ఊరు -మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది? వారికి ఏ అవసరం ఉందో వివరాలు సేకరించాలన్నారు. అంకితభావంతో పనిచేస్తే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు, తెలంగాణ రాష్ట్ర సాధనే అందుకు నిదర్శనం. మిషన్ భగీరథ మరో ఉదాహరణ. ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చిన్న జిల్లాల ఏర్పాటు ఫలాలు ప్రజలకు అందాలి. గ్రామీణ అర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే లక్ష్యం కావాలన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో బాగా పని చేసే అధికారులను గుర్తించి తగిన బహుమతి ఇవ్వాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో అదనంగా ఉన్న సిబ్బందిని గుర్తించి పని భారం ఎక్కువగా ఉన్న శాఖలకు బదలాయించాలన్నారు. ఏడాదిలోగా అన్ని జిల్లాల్లో సమీకృత కార్యాలయాలు, జిల్లా పోలీసు కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలన్నారు. హాస్పిటళ్లు, హాస్టళ్లు సందర్శించి అవి మరింత బాగా ఉండేటట్టు చూడాలి. గ్రామాల్లో ‘క్లీన్ ది విలేజ్’ కార్యక్రమం చేపట్టాలి. కూలిన ఇళ్లు, ముళ్ల పొదలు, చెత్తా చెదారాన్ని తొలగించాలి. వీటిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం..కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్న సిఎస్ ఎస్పీసింగ్