తెలంగాణ

ఖాజీపేటలో వ్యాగన్ల వర్క్ షాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఖాజీపేటలో రైలు వ్యాగన్ల వర్క్ షాప్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 185 ఎకరాలు కేటాయిస్తే వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించవచ్చని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఖాజీపేటలో వ్యాగన్ల వర్క్ షాప్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 20 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి రైల్వే అధికారులు, మెట్రో రైల్ అధికారులతో కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆదివారం సమీక్షించారు.
అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు గతం కంటే ఈ బడ్జెట్‌లో మూడు రేట్లు అధికంగా నిధులు కేటాయించడం సంతోషకరమని అన్నారు. తాను లోగడ రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన కొన్ని రైల్వే ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎంఎంటిఎస్ రెండో దశ పనులకు కేంద్రం ఈ బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన తెలిపారు. కొత్తగా ఫలక్‌నుమా- ఉందానగర్, వౌలాలి- ఘట్‌కేసర్, బొల్లా రం-మేడ్చల్, పటాన్‌చెరు ప్రాంతాలకు ఎంఎంటిఎస్ ప్రాజెక్టు రెండో దశలో పనులు ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పా రు. ఘట్‌కేసర్-యాదాద్రికి కూడా ఎంఎంటిఎస్ పొడిగించనున్నట్లు తెలిపారు. ఈ రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. అక్కన్నపేట-మెదక్ రైల్వే మార్గానికి 196 కోట్లు, మునీరాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే మార్గానికి 300 కోట్లు, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గానికి 350 కోట్లు, 7 రైల్ అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి 550 కోట్లు, 12 రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి 385 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వివరించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, ఎమ్మెల్యేలు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.