తెలంగాణ

జల్సాలతో జైలుపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 6: హైదరాబాద్‌లో జల్సాలకు అలవాటుపడుతున్న యువకులు నేరస్థులుగా మారిపోతున్నారు. సరదా కోసమంటూ కొందరు, మద్యం వ్యసనంతో మరికొందరు, గర్ల్‌ఫ్రెండ్స్ కోరికలు తీర్చడం కోసం ఇంకొందరు చోరీలకు పాల్పడుతున్నారని ఇటీవల హైదరాబాద్ పోలీసులు, మానసిక నిపుణుల సర్వేలో వెల్లడైంది. నిరుద్యోగ యువకులు, దొంగతనానికి అలవాటుపడ్డవారు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాన్ని పోషించడం కోసం చోరీలకు పాల్పడటం మనకు తెలిసిన విషయమే. కానీ ఏకంగా ఇంజనీర్ విద్యార్థులే తమ సరదాల కోసం, జల్సాలకు అలవాటుపడి జైలుకెళ్తున్నారు. నిరుడు హైదరాబాద్‌కు చెందిన 20మందికి పైగా ఇంజనీరింగ్ విద్యార్థులు జైలుకెళ్లినట్టు పోలీసులు, మానసిక నిపుణులు తెలిపారు. ఇటీవల కూకట్‌పల్లిలోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి విటులు, వ్యభిచారిణుల వద్ద డబ్బులు లాక్కున్న ఘటనలో పట్టుబడిన ఆరుగురు విద్యార్థులు ఇంజనీర్లే, ఎల్‌బినగర్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిందీ ఇంజనీరింగ్ విద్యార్థులే. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడిన ఎనిమిది మంది ఇంజనీర్లలో డ్రగ్స్, గంజాయి విక్రేతలు కూడా ఉండటం గమనార్హం. అదే విధంగా గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలసి జల్సాలు, స్నేహితులతో కలసి హుక్కా సెంటర్లు, బార్‌లకు వెళ్లడం కోసం డబ్బు అనివార్యం.
కాగా విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారని నగరానికి చెందిన మానసిక నిపుణురాలు రాధిక ఆచార్య అభిప్రాయపడ్డారు. కొత్త సంవత్సరం నెల రోజుల్లో 14మంది విద్యార్థులు దురలవాట్లకు పాటుపడి జైలుకు వెళ్లడం విచారకరం. వీరిలో అత్యధికులు ధనికులు ఉండడం మరీ దారుణమని ఆమె అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, వారి అలవాట్ల పట్ల శ్రద్ధ తీసుకోవకపోవడం, వారిపై సరైన నిఘా వేయకపోవడం, క్రమశిక్షణ వంటి వాటిని గుర్తెరగకపోవడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. మారుతున్న సమాజానికి అనుగుణంగానే విద్యార్థుల అభిరుచిని తెలుసుకుని వాటి ఇష్టాఅయిష్టాల మేరకు వసతులు కల్పించినట్లయితే విద్యార్థులు చెడు మార్గంలో నడవరని, వీరికి కౌనె్సలింగ్ కేంద్రాలకు పంపినట్లయితే మంచి, చెడు విషయాలు తెలుస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
జల్సాలకు అలవాటుపడితే..ఈజీగా డబ్బు సంపాదించడానికి వీరికి చైన్‌స్నాచింగ్ అతి సులువని ఎంచుకుంటారని, దోపిడీకి పాల్పడి ఎక్కడో ఓ చోట పోలీసులకు పట్టుబడక తప్పదు. అలాంటప్పుడు నిందితుల్లో విద్యార్థులు ఇంజనీర్లు అధికంగా ఉంటారని ఓ సర్వే వెల్లడిస్తున్నట్టు రాధిక ఆచార్య తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులతోపాటు కుటుంబ సభ్యులకు కౌనె్సలింగ్ ఇస్తే దుర్వ్యసనాలకు పాల్పడే అవకాశం ఉండదని రాధిక ఆచార్య పేర్కొన్నారు.